
కోల్‌కతా: భారత వైమానిక దళంలోకి మరో 200 యుద్ధ విమానాలను చేర్చనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారుచేసే 83 ఎల్‌సీఏ తేజస్ మార్క్ 1ఏ విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉందన్నారు. మొత్తంగా 200 విమానాలను తీసుకొనే ప్రక్రియ సాగుతోందన్నారు. ఎల్‌సీఏ మార్క్ 1ఏ విమానాల డిజైన్ పూర్తయినందున ఉత్పత్తిని ఏడాదికి 16కి పెంచుతుందన్నారు.