విషమంగా మార్షల్ అర్జన్ సింగ్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎఎఫ్ మార్షల్ అర్జన్ సింగ్ (98) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆయనకు ఈ రోజు ఉదయం మాసివ్ అటాక్ రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రిలో అర్జన్ సింగ్‌కు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) చీఫ్ ధనోవా.. ఆర్మీ ఆస్పత్రికి వెళ్లారు. అర్జన్ సింగ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అర్జన్ సింగ్‌ను చూశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్జన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. అలాగే వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.
We are all praying for the speedy recovery of Marshal of the Indian Air Force Arjan Singh. Doctors are doing their best.
— Narendra Modi (@narendramodi) 16 September 2017
Went to R&R Hospital to see Marshal of the Indian Air Force Arjan Singh, who is critically ill. I also met his family members.
— Narendra Modi (@narendramodi) 16 September 2017
భారత మిలటరీ చరిత్రలో అర్జన్ సింగ్ ఓ ఐకాన్. 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫైవ్ స్టార్ ర్యాంక్ దక్కిన అధికారి అర్జన్ సింగ్ మాత్రమే. ఫీల్డ్ మార్షల్‌తో సమానమైన డిస్టింక్షన్‌ను పొందిన ఏకైక ఐఏఎఫ్ అధికారి. అర్జన్ సింగ్ 1919 ఏప్రిల్ 15న (పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్) ల్యాలాపూర్‌లో జన్మించారు.1949లో ఎయిర్ కమాండర్‌గా ఎదిగిన ఆయన 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత వాయుసేన చీఫ్‌గా ఉన్నారు. అర్జన్ సింగ్ సేవలకు గుర్తింపుగా పనాగఢ్ ఎయిర్ బేస్‌కు ఎయిర్ మార్షల్ అర్జన్ సింగ్ పేరు పెట్టడం విశేషం.