![Air Force New Chief Rakesh Kumar Singh comments about Pak - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/1/BHADAURIA-3.jpg.webp?itok=ppY7KWbz)
న్యూఢిల్లీ: భారత్–పాక్ సరిహద్దుల్లోని పరిస్థితులపై భారత వాయు సేన(ఐఏఎఫ్) ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, అవసరమైతే బాలాకోట్ తరహాలో మరో వైమానిక దాడికి దిగేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని ఐఏఎఫ్ నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా వెల్లడించారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఎలాంటి ఆపరేషన్లు అయినా చేపడతామని తెలిపారు. అంతకుముందు భారత వాయు సేనలో 26వ ఎయిర్ చీఫ్ మార్షల్‌గా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందిన చీఫ్ బీఎస్ ధనోవా స్థానంలో రాకేశ్ బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment