air attacks
-
Talibans warning: పాకిస్తాన్‌కు తాలిబన్ల సీరియస్ వార్నింగ్.. షాక్‌లో పాక్
కాబూల్: దాయాది దేశం పాకిస్తాన్, తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఆప్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులపై పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 60 మందికిపైగా ఆప్ఘన్ సాధారణ పౌరులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు ఆదివారం పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. పాక్ దాడులపై తాలిబాన్ ప్రభుత్వానికి చెందిన సమాచార, సాంస్కృతిక శాఖ ఉప మంత్రి జబివుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. ఆఫ్ఘన్ల సహనాన్ని పరీక్షించకండి. ఆ తర్వాత జరిగే తీవ్రమైన పరిణామాలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా, మరోసారి వైమానిక దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇలాంటి ఘటన వల్ల రెండు దేశాల మధ్య వివాదాలు పెరుగుతాయన్న ముజాహిద్.. దౌత్య మార్గాల్లో సమస్యల పరిష్కారానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. పాక్ వైమానిక దాడుల అనంతరం ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని పాకిస్తాన్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌తో తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమావేశమైంది. ఈ సందర్బంగా ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించింది. ఇది చదవండి: సీన్ రివర్స్.. మాట మార్చిన ఇమ్రాన్‌ఖాన్ -
మరో ‘బాలాకోట్’కు రెడీ
న్యూఢిల్లీ: భారత్–పాక్ సరిహద్దుల్లోని పరిస్థితులపై భారత వాయు సేన(ఐఏఎఫ్) ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, అవసరమైతే బాలాకోట్ తరహాలో మరో వైమానిక దాడికి దిగేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని ఐఏఎఫ్ నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా వెల్లడించారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఎలాంటి ఆపరేషన్లు అయినా చేపడతామని తెలిపారు. అంతకుముందు భారత వాయు సేనలో 26వ ఎయిర్ చీఫ్ మార్షల్‌గా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందిన చీఫ్ బీఎస్ ధనోవా స్థానంలో రాకేశ్ బాధ్యతలు స్వీకరించారు. -
సర్జికల్ స్ట్రైక్ 2 : ‘భూకంపం వచ్చిందేమో అనుకున్నాం’
ఇస్లామాబాద్ : భారత వైమానిక దళం మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై 12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాద స్థావరాలను సమూలంగా నేలమట్టం చేసింది. ఈ దాడిలో వైమానిక దళం ఆరు బాంబులను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. వీటి గురించి ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారంటే.. ‘తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించింది. భూకంపం వచ్చిందా.. లేక పిడుగు పడిందా అనిపించింది. ఇక మేం నిద్రపోలేదు. 5-10 నిమిషాల తర్వాత అర్థమయ్యింది అవి బాంబులు పేలిన శబ్దాల’ని అంటూ చెప్పుకొచ్చారు. జాబా గ్రామానికి చెందిన మరో రైతు మాట్లాడుతూ ‘దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో మా బంధువులు ఉన్నారు. ఈ దాడుల్లో మా బంధువు ఒకరు గాయపడ్డారు. చుట్టూ పక్కల ఉన్న ఇళ్లు నేలమట్టం అయ్యాయి. మొత్తం 5 బాంబుపేలుళ్లను, విమానాల చప్పుళ్లను విన్నాం. ఉదయాన్నే కొన్ని బాంబు శకలాలను, నాలుగైదు ఇళ్లు నేలమట్టం అవ్వడం చూశాము’ అని తెలిపాడు. కానీ పాకిస్తాన్ మాత్రం దాడులు జరిగాయనే విషయాన్ని అంగీకరించడం లేదు. భారత్ దాడులు చేయడానికి ప్రయత్నించిందని.. కానీ పాక్ యద్ధ విమనాలను చూసి భయపడి దాడి ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. (సర్జికల్ స్ట్రైక్ - 2 జరిగిందిలా..!) -
‘మిరాజ్’.. భారత్ వజ్రాయుధం
-
‘మిరాజ్’.. భారత్ వజ్రాయుధం
న్యూఢిల్లీ : యుద్ధంలో అనుభవమున్న సైనికునికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. కారణం అప్పటికే అతను పలు యుద్ధాల్లో పాల్గొని ఉంటాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో అతనికి ముందే తెలిసి ఉంటాయి కాబట్టి. ఈ రోజు భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్‌లో కూడా దీన్నే పాటించింది. అధునికత కన్నా అనుభవానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం మన వైమానిక దళంలో సుఖోయ్ 30 ఎంకేఐ, తేజస్, మిగ్ 29 వంటి ఆధునిక యుద్ధవిమానాలు ఉన్నప్పటికి.. ఈ దాడికి మిరాజ్‌నే ఎంచుకుంది. భారత వజ్రాయుధంగా పిలుచుకునే మిరాజ్ 2000 వివరాలు.. ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న అతిముఖ్యమైన యుద్ధవిమానాల్లో మిరాజ్ 2000 ఒకటి. 1985లో ఇవి భారత వైమానిక దళంలో చేరాయి. వీటిని దసాల్ట్ ఏవియేషన్ సంస్థ అభివృద్ధి చేసింది. అప్పుడు వీటికి ‘వజ్ర’ అని నామకరణం చేశారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ వీటిని ఉపయోగించింది. ఈ యుద్ధంలో భారత దేశం విజయం సాధించడానికి కారణం మిరాజ్ 2000 విమానాలే. ఈ ఫలితంతో భారత ప్రభుత్వం మరిన్ని మిరాజ్ విమానాలను ఆర్డర్ చేసింది. ప్రస్తుతం భారత్‌తో పాటు ఎనిమిది దేశాలు ఈ విమానాలను ఉపయోగిస్తున్నాయి. ప్రత్యేకతలు.. సింగిల్ సీట్ ఉండే ఈ విమానంలో తేలికైన చిన్న ఇంజిన్ మాత్రమే ఉంటుంది. దీని బరువు 7500 కిలోలు. గంటకు 2,336 కిలో మీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. గగనతలంలో 17 కిలో మీటర్ల పై నుంచి దాడి చేసే సామార్థ్యం దీని సొంతం. లేజర్ గైడెడ్ బాంబులను సులభంగా తీసుకెళ్లే ఈ విమానం గగన తలం నుంచి గగన తలంలోకి, గగనతలం నుంచి భూతలానికి దాడి చేయగలదు. అదే సమయంలో భూమికి అతితక్కువ ఎత్తులో అత్యధిక వేగంతో కూడా ప్రయాణించగలదు. ఈ ప్రత్యేకత వ్లల రాడార్లలో దీన్ని గుర్తించడం శత్రు శిబిరానికి కష్టంగా మారిపోతుంది. లేజర్ గైడెడ్ బాంబులను కూడా మిరాజ్ ప్రయోగించగలదు. అందుకే చకచకా పూర్తి కావాల్సిన ఆపరేషన్లకు భారత వాయుసేన మిరాజ్‌నే ఎంచుకొంటుంది. దీనికి తగ్గట్టే కేవలం 21 నిమిషాల్లోనే మిరాజ్ విమానాలు శత్రు స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగి వచ్చాయి. తోక ముడిచిన పాక్ ఎఫ్ - 16 అయితే భారత్ మిరాజ్ యుద్ధ విమనాలను కొనుగులు చేయడంతో దీనికి ప్రతిగా పాక్ అమెరికా తయారు చేసిన ఎఫ్ -16 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. నేడు బాలాకోట్ దాడి సందర్భంగా ఈ రెండు యుద్ధవిమానాలు ముఖాముఖీ తలపడ్డాయి. కానీ మిరాజ్ దెబ్బకు పాక్ విమానాలు తోకముడిచాయి. (ఇక్కడ చదవండి : విఫలమైన పాకిస్తాన్ ప్రతి దాడి..) -
రిపబ్లిక్ డేకు ఢిల్లీ అంతటా గప్‌చుప్
న్యూఢిల్లీ: పోలీసుల, సైనికుల దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చి దాడులకు పాల్పడే అవకాశం ఉందని జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం చెప్పింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే, కొన్ని ముస్లిం ఉగ్రవాద సంస్థలు 9/11 తరహా దాడులను చేసే అవకాశం ఉందని, అందుకోసం వారు చార్టెడ్ విమానాలు, డ్రోన్లను ఉపయోగించి బాంబులతో దాడి చేసే ప్రమాదం ఉందన్నారు. గురువారం దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, విదేశాల నుంచి వచ్చే అతిథులు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్లిగల్లీలో ఎలాంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీటీవీలను అమర్చారు. ఇప్పటికే పెద్ద పెద్ద భవనాల్లో యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ కూడా సిద్ధం చేశారు. ఢిల్లీ అంతటా కూడా దాదాపు 50 వేల బలగాలను మోహరించారు. డ్రోన్ల దాడిని, విమానాల దాడిని ఎదుర్కొనే సాంకేతిక పరిజ్ఞానం కూడా సిద్ధం చేసి ఉంచారు.