మీ ఆట అదిరింది: సెహ్వాగ్‌ | Boys Played Really Well, Sehwag to IAF Strike | Sakshi
Sakshi News home page

మీ ఆట అదిరింది: సెహ్వాగ్‌

Published Tue, Feb 26 2019 11:17 AM | Last Updated on Tue, Feb 26 2019 12:22 PM

Boys Played Really Well, Sehwag to IAF Strike - Sakshi

న్యూఢిల్లీ: పుల్వామా దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకోవడంతో యావత్‌ భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది.  సర్జికల్‌ స్ట్రైక్‌-2తో  పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లకు ఘన నివాళులర్పించిందని జాతి మొత్తం గర్విస్తోంది. భారత వైమానిక దళం చేసిన తాజా దాడుల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ జవాన్లు.. మీ ఆట అదిరింది’ అంటూ  వీరేం‍ద్ర సెహ్వాగ్ తన ట్వీటర్‌ అకౌంట్‌లో అభినందించాడు. ఇందుకు ఎయిర్‌స్ట్రైక్‌ హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించాడు. మరొక మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ స్పందిస్తూ.. ‘ భారత్‌ ఆర్మీకి ఇదే నా సెల్యూట్‌’ అని ట్వీట్‌ చేశాడు. ఇక గౌతం గంభీర్‌ ‘జై హింద్ ఐఎఎఫ్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. (ఇక్కడ చదవండి: సర్జికల్‌ స్ట్రైక్‌ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం!)

టీమిండియా యువ క్రికెటర్‌ యజ్వేంద్ర చహల్‌ భారత ఆర్మీని ప్రశంసించాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దేశం మొత్తాన్ని కలచివేసిన ఆ ఘటనకు ప‍్రతీకారంగానే ఉగ్రస్థావరాలపై భారత్‌ మరో మెరుపు దాడి చేసింది. ఈ ఘటనలో 200 నుంచి 300 వరకూ ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement