
సాక్షి, హైదరాబాద్ : ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాయాదీ పాకిస్తాన్‌లో భారత వైమానిక దళం జరిపిన దాడులపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. భారత సైన్యాన్ని కొనియాడుతూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
‘పొద్దుగల పొద్దుగల మన భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి పోయి దాదాపు వెయ్యి కేజీల బాంబును పేల్చి వచ్చింది. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తామని మోదీ అన్నారు. అన్నట్లే చేశారు. ఈ ఘటనపై భారత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌కు భారత సైన్యం వారి రీతిలోనే జవాబిచ్చింది. భారత ప్రజలకు అభినందనలు. ఈ దాడులు జరిపిన భారత సైన్యానికి, ప్రధాని నరేంద్రమోదికి ధన్యవాదాలు. జస్ట్ ఇది సాంపిల్ మాత్రమే.. ఇంకా పాక్‌ను మొత్తం తగలబెట్టాలి. ఆ సమయం కూడా త్వరలో వస్తుంది.’ అని వ్యాఖ్యానించారు.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత వైమానిక దళం చేసిన మెరుపు దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. జైషే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. 12 మిరాజ్-200 జైట్ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 భారత వాయిసేన విజయవంతంగా పూర్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment