Air strike
-
బీరూట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 12 మంది మృతి
బీరూట్: లెబనాన్‌లోని ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా స్థావరాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుంటోంది. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దళం బీరుట్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 12 మందికి పైగా జనం మృతిచెందారు. అలాగే లెబనాన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి భారీ నష్టం వాటిల్లింది.ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో 57 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ బీరుట్ శివార్లలోని రఫిక్ హరిరి యూనివర్శిటీ హాస్పిటల్ సమీపంలోని పలు భవనాలు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. హెజ్బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టంగా తెలియజేయలేదు. మరోవైపు హెజ్బొల్లా కూడా సెంట్రల్ ఇజ్రాయెల్‌లోకి పలు రాకెట్లను వదలడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ దాడులతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.గాజా కాల్పుల విరమణ చర్చలను పునఃప్రారంభించే లక్ష్యంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ ఇక్కడకు చేరుకోవడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది. ఇదిలావుండగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్‌ను మట్టుబెట్టి, అక్కడ బందీలుగా ఉన్న ప్రజలను విడిపిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా మాత్రమే వారి బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది.గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో దాదాపు 1,200 మంది మరణించగా, 250 మంది జాడ తెలియరాలేదు. అప్పటి నుండి ఇజ్రాయెల్ వరుసగా హమాస్ స్థానాలపై దాడి చేస్తూవస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ ఎదురుదాడిలో 42 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారని స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ యుద్ధంతో గాజాలో చాలా ప్రాంతం ధ్వంసమైంది. అక్కడి జనాభాలో 90 శాతం మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.ఇది కూడా చదవండి: నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ హతం: ఇజ్రాయెల్ -
పుల్వామా దాడికి ఐదేళ్లు... ఆ రోజు ఏం జరిగింది?
2019, ఫిబ్రవరి 14.. సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్‌కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్‌పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్తాన్లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇంతకీ ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి 14న పాక్ ఎటువంటి దాడికి పాల్పడిందో, దానికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇప్పుడొకసారి గుర్తుచేసుకుందాం. ఐదేళ్ల క్రితం ఇదేరోజున సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. సైనికులు ఉన్న ఈ కాన్వాయ్‌లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు కఠిన చర్యలు అవలంబించింది. ఫలితంగా పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. 2019, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ, కాశ్మీర్‌లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్‌కు చెందిన యుద్ధ విమానం ‘మిగ్-21’ పాకిస్తాన్ సైన్యం దాడికి గురై, అక్కడే పడిపోయింది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ సైనికులు ‘మిగ్-21’ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్నారు. 2019, మార్చి ఒకటిన అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ అప్పటివరకూ పాక్‌తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు మనీలాండరింగ్‌పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)ను కూడా భారత ప్రభుత్వం కోరింది. -
అరేబియా సముద్రంలో భారత్‌కు వస్తున్న నౌకపై డ్రోన్ దాడి..
అరేబియా సముద్రం ద్వారా భారత్ వస్తున్న ఓ వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. పోరుబందర్ తీరానికి 401 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. డ్రోన్ దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. అయితే ఆ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నౌక మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో 20 మంది భారతీయులు నౌకలో ఉన్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ సముద్ర మారిటైమ్ ఎజెన్సీ అంబ్రే శనివారం పేర్కొంది. లైబేరియన్ జెండాతో ఉన్న ఈ నౌక.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎంవీ కెమ్ ఫ్ల్యూటో అనే వాణిజ్య నౌక. ప్రమాదంపై సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు..‘ఐసీజీఎస్ విక్రమ్’ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సాయం చేసేందుకు సదరు ప్రాంతంలోని అన్ని నౌకలను విక్రమ్ అలర్ట్ చేసినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భారత కోస్ట్‌గార్డ్‌కు చెందిన గస్తీ నౌక ఐసీజీఎస్ విక్రమ్ ఘటనాస్థలానికి వెళ్లి వాణిజ్య నౌకలో మంటలను ఆర్పివేసింది. కాగా ఈ నౌక సౌదీ అరేబియా ఓడరేవు నుంచి క్రూడాయిల్‌తో మంగళూరుకు వైపు వెళుతోంది. అయితే.. ఆ నౌకపై డ్రోన్ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. చదవండి: Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్ -
గాజా, సిరియా, వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సొంత పౌరులపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 100 మంది మృతి
మయన్మార్‌లో పాలక సైన్యం దారుణానికి తెగబడింది. సొంత పౌరులపై వైమానిక దాడి జరిపింది. సైనిక పాలనను వ్యతిరేకించే ఓ వర్గంపై ఆర్మీ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ భీకర దాడిలో 100 మందికి పైగా చనిపోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. కాగా సగయింగ్ ప్రాంతంలోని పాజిగై గ్రామంలో మంగళవారం ఉదయం 8 గంటలకు సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో మయన్మార్ సైన్యం ఆ గ్రామంపై ఫైటర్ జెట్‌తో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 100 మందికి పైగా మరణించగా.. మృతుల్లో మహిళలు, 20 నుంచి 30 మంది చిన్నారులు, స్థానికంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేక సాయుధ గ్రూపులు, ఇతర ప్రతిపక్ష సంస్థల నాయకులు కూడా ఉన్నారని ప్రతక్ష్య సాక్షి ఒకరు స్థానిక మీడియాతో వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. అయితే మయన్మార్ సైన్యం వివరాలను బయటకు పొక్కనీయకపోవడంతో మృతుల సంఖ్యపై స్పష్టత లేదు. చదవండి: Bathinda: మిలిటరీ స్టేషన్లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి.. ఇక ఈ దాడి తామే చేసినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం జుంటా ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నందుకు పాజిగై గ్రామంపై అటాక్ చేశామని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. ఈ ఘటనను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. మయన్మార్ మిలిటరీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా అమాయక పౌరులపై సాయుధ దళాల దాడిని ఉగ్రవాద సైన్యం జరిపిన హేయమైన చర్యగా ప్రతిపక్ష నేషనల్ యూనిటీ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి సైన్యం దేశ అధికారాన్ని లాక్కుంది. అప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిని అణచివేసేందుకు విపరీతంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భద్రతా బలగాలు దాదాపు 3,000 మంది పౌరులను పొట్టనపెట్టుకున్నట్లు సమాచారం. -
రష్యా vs ఉక్రెయిన్: మారియుపోల్ మారణహోమం..!!
-
బాలాకోట్ ఆపరేషన్: లాంగ్ రేంజ్ స్టైక్
ఢిల్లీ: ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత సైన్యం నిర్వహించిన బాలాకోట్ ఆపరేషన్‌కు రెండేళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన ఫైటర్ జెట్లు నియంత్రణ రేఖను(ఎల్ఓసీ) దాటి, పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులకు భారీగా నష్టం వాటిల్లింది. బాలాకోట్ ఆపరేషన్ రెండో వార్షికోత్సవం సందర్భంగా భారత వైమానిక దళం తాజాగా ప్రయోగాత్మకంగా లాంగ్ రేంజ్ స్ట్రైక్ నిర్వహించింది. ప్రాక్టీస్ టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. బాలాకోట్ ఆపరేషన్ చేపట్టిన స్క్వాడ్రన్ బృందమే ఈ లాంగ్ రేంజ్ స్ట్రైక్‌లో పాల్గొనడం విశేషం. చదవండి: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్: ‘కోతి ఖతమైంది’ -
అతడిని అమెరికా ఎలా చంపిందంటే?
న్యూఢిల్లీ : ఇరాన్ అత్యున్నత స్థాయి మిలటరీ కమాండర్ ఖాసీం సులేమానిని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ డ్రోన్ క్షిపణిల ద్వారా చంపిన విధానం చూస్తే అమెరికా సాంకేతిక సంపత్తి సామర్థ్యం ఏమిటో స్పష్టం అవుతుంది. సిరియా నుంచి బయల్దేరి ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం దిగిన సులేమాని, ఇరాక్‌లో ఇరాన్ తరఫున పనిచేస్తున్న ప్రైవేట్ సైన్యం డిప్యూటి కమాండర్ అబూ మెహదీ అల్ ముహందీస్‌తో కలిసి విమానాశ్రయం కార్గో ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారిద్దరు కలిసి ఒక టయోటా ఎస్‌యూవీలో ఎక్కగా, వారిద్దరు బాడీ గార్డులైన ఎనిమిది మంది మరో టయోటా ఎస్‌యూవీలో ఎక్కి విమానాశ్రయం బయటకు వచ్చారు. అప్పటికే ఖతార్‌లోని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం నుంచి బయల్దేరిన ‘యూస్–ఎంక్యూ 9 రీపర్’ డ్రోన్’ సులేమాని, అబూ మెహదీ ప్రయాణిస్తున్న ఎస్యూవీ కారుపై రెండు లేజర్ గైడెడ్ క్షిపణిలను, వారి బాడీ గార్డులు వెళుతున్న కారుపైకి మరో క్షిపణిని ప్రయోగించింది. అవి గురితప్పకుండా కార్లను ఢీకొనడంతో పేలుడు సంభవించి రెండు వాహనాలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ఈ సంఘటనలో రెండు కార్లలో వెళుతున్న మొత్తం పది మంది మరణించారు. సులేమాని శరీర శకలాలను ఆయన చేతి ఉంగరం ద్వారా గుర్తించినట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఇద్దరు పైలెట్లు ఉండే ఈ రీపర్ డ్రోన్ గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకురావడమే కాకుండా నిశ్శబ్దంగా ప్రయాణించడం విశేషం. ఓ యుద్ధ ట్యాంకును తునాతునకలు చేయగల బాంబు శీర్షాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన నాలుగు ‘హెల్ఫైర్’ క్షిపణలు ఈ డ్రోన్‌కు అమరుస్తారు. వీటిని నీంజా క్షిపణులుగా కూడా వ్యవహరిస్తారు. ఈ డ్రోన్ ఖరీదు ఆరున్నర కోట్ల డాలర్లు. సులేమానిని హతమార్చేందుకు గతంలో అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక 2016 నుంచి సులేమానిపై అమెరికా సైనిక ఇంటెలిజెన్స్ పక్కా నిఘాను కొనసాగిస్తూ వస్తోంది. సంబంధిత వార్తలు అమెరికా-ఇరాన్ యుద్ధం; భారత్‌కు ముప్పు ఇరాన్ వెన్ను విరిగింది! ఉద్రిక్తం.. అమెరికా మరోసారి రాకెట్ల దాడి ఇరాన్ గగనతలం మీదుగా విమానాలు వెళ్లనివ్వద్దు -
బాలాకోట్ దాడులపై రెండో సినిమా..
యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకనిర్మాతలు ముందంజంలో ఉంటారు. సినిమాలు తీయడమే కాకుండా వారి రికార్డులు వారే తిరగరాసుకుంటారు. ఈ క్రమంలో హిందీలో తాజాగా మరో యదార్థ ఘటనల ఆధారంగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనినే కథాంశంగా తీసుకొని సినిమా తీయనున్నట్లు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించారు. భూషణ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘కేదార్నాథ్’ దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడని తెలిపారు. ఈ భారత సైన్య పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని భూషణ్ కుమార్ తెలిపారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలకు ప్రతీకగా ఈ సినిమా నిర్మితమవుతుందన్నారు. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో బాంబులు వర్షం కురిపించి ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. అయితే ఆ సమయంలో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కగా, అనూహ్య పరిణామాల తర్వాత తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. ఆయన ధైర్యసాహసాలను మెచ్చిన భారత ప్రభుత్వం అభినందన్‌కు ‘వీర్‌చక్ర’ పురస్కారాన్ని అందించింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ‘బాలాకోట్- ది ట్రూ స్టోరీ’ సినిమా తీస్తానని ప్రముఖ నటుడు, నిర్మాత వివేక్ ఒబెరాయ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు ఒకే ఘటనపై రెండు రకాల సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది. A story that celebrates the accomplishments of The Indian Air Force🇮🇳#2019BalakotStrike @PMOIndia @DefenceMinIndia @IAF_MCC #SanjayLeelaBhansali @itsBhushanKumar @AbhisheKapoor #MahaveerJain, @PragyaKapoor_ @Tseries @gitspictures @SundialEnt @prerna982 pic.twitter.com/A5Oh8xpMyB — BhansaliProductions (@bhansali_produc) December 13, 2019 -
భారత బాంబులపై ‘రాయ్‌టర్స్’ బాంబ్
సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరంపై బాంబుల వర్షం కురిపించిన సంఘటనపై జాతీయంగా, అంతర్జాతీయంగా భిన్న కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాల్లో నెట్వర్క్ కలిగిన ‘రాయటర్స్ న్యూస్ ఏజెన్సీ’ బుధవారం ఓ బాంబు పేల్చింది. బాలకోట్‌లోని ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళం దాడులు జరిపిన ఆరు రోజుల అనంతరం అంటే, మార్చి 4వ తేదీన శాన్ఫ్రాన్సిస్కోలోని ‘ప్లానెట్ లాబ్స్ ఇన్కార్పొరేటెడ్’ తీసిన బాలకోట్‌లోని జైషే మొహమ్మద్ మదర్సా శాటిలైట్ చిత్రాలను, అంతకుముందు 2018, ఏప్రిల్ నెలలో ఇదే శాటిలైట్ తీసిన ఇదే స్థావరం చిత్రాలను విడుదల చేసింది. వాటిని పోల్చి చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చదవండి....(‘బాలకోట్’లో భారత్ గురి తప్పిందా?!) బాలకోట్‌లోని భవనాల పైకప్పులపై ఎలాంటి రంధ్రాలుగానీ, కూలిన గోడలుగానీ, కాలిన గుర్తులుగానీ, బాంబులు పడ్డాయని చెప్పడానికి సంబంధించి మరెలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని స్పష్టం చేసింది. శాటిలైట్ పాత చిత్రాలకు, కొత్త చిత్రాలకు ఎలాంటి తేడా కనిపించడం లేదని పేర్కొంది. బాలకోట్‌పై జరిపిన భారత వైమానిక దాడిలో 250 నుంచి 350 వరకు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, అందుకు సాక్ష్యాలు చూపించాలంటూ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన జవాన్ల కుటుంబాలు కూడా బాలకోట్ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళాలు జరిగిన దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాలు చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. అసలేం జరిగి ఉండవచ్చు! 1. ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారు జామున 3.30 గంటల ప్రారంతంలో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు పాక్ భాభాగంలోకి దూసుకుపోవడం నూటికి నూరు పాళ్లు నిజం. ఈ విషయాన్ని మనకంటే పాకిస్థాన్ వర్గాలే ముందుగా ప్రకటించాయి. సకాలంలో తాము అప్రమత్తమైన భారత యుద్ధ విమానాలను తరమి కొట్టామని, ఆ తొందరలో భారత యుద్ద విమానాలు లక్ష్య రహితంగా బాంబులు కురపిస్తూ పారిపోయాయని, తమవైపు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని పాక్ సైనిక వర్గాలు తెలిపాయి. బాలకోట్‌కు పది కిలోమీటర్ల ఇవతల బాంబులు పడ్డాయని, వాటి వల్ల కొన్ని చెట్లు కూలయని, కొన్ని చోట్ల గుంతలు పడ్డాయంటూ కొన్ని ఫొటోలను కూడా పాక్ సైనిక వర్గాలు ఆ తర్వాత విడుదల చేశాయి. 2. భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఆ తర్వాత ఓ ప్రకటన విడుదల చేశారు. బాలకోట్‌లోని జైషే మొహమ్మద్ అతిపెద్ద ఉగ్ర శిక్షణ కేంద్రంపై భారత వైమానిక దళాలు బాంబు దాడులు జరిపాయని, ఈ దాడిలో పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులు, వారి శిక్షకులు, సీనియర్ కమాండర్లు, ఆత్మాహుతి బందాల సభ్యులు మరణించారని చెప్పారు. ఆ తర్వాత ఉగ్రవాదులు మతుల సంఖ్య 350 వరకు ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. 3. భారత వైమానిక దాడులపై భిన్న కథనాలు వస్తున్న నేపథ్యంలో పలు జాతీయ, అంతర్జాతీయ జర్నలిస్టులు బాల్కోట్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లారు. వారికి స్థానికులు, పాక్ సైనికులు ‘బాంబులు వేసింది ఇక్కడే’ అంటూ కొన్ని బాంబులు పడిన గుర్తులను చూపారు. బాంబు దాడిలో ఓ పౌరుడికి గాయం అయిన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడికి సమీపంలోనే ఉన్న మదర్సా (ఉగ్రవాదుల శిక్షణా కేంద్రం)ను సందర్శించేందుకు మాత్రం పాక్ సైనికులు అనుమతించడం లేదు. దాంతో అంతర్జాతీయ మీడియా శాటిలైట్ ఛాయా చిత్రాలతో భారత్ దాడులు గురి తప్పాయంటూ పలు కథనాలను ప్రచురించాయి. బాంబు దాడుల వల్ల ఉగ్రవాదులకు అపార నష్టం వాటిల్లిందని రుజువు చేయడాని భారత వైమానిక దళం వద్ద రాడార్ చిత్రాలు, భారత సైన్యం వద్ద శాటిలైట్ చిత్రాలు ఉన్నాయంటూ కొన్ని జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోదీ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాన్ని సాగిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తక్షణం ఆ రాడార్, శాటిలైట్ చిత్రాలను విడుదల చేసి అనుమానాలను పటాపంచలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. -
బాలాకోట్‌లో 250 మంది ఉగ్రవాదులు మృతి!
న్యూఢిల్లీ: గతవారం పాకిస్థాన్ బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారన్నదని కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం గుజరాత్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఓ సంఖ్య చెప్పారు. ఐఏఎఫ్ ఆపరేషన్‌లో 250 మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారని ఆయన తేల్చేశారు. వైమానిక దాడుల్లో ఎంతమంది చనిపోయారో అధికారికంగా తెలుపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ అధ్యక్షుడైన అమిత్ షా అధికారికంగా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం మన బలగాలు పాకిస్థాన్ వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాయి. మన జవాన్ల మృతికి సైన్యం ప్రతికారం తీర్చుకుంది. పూల్వామా దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించకపోవచ్చునని అందరూ భావించారు. కానీ, ఏం జరిగింది? ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 13 రోజులకే మన ప్రభుత్వం వైమానిక దాడులు నిర్వహించి 250మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది’ అని అహ్మదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రకటించారు. -
‘బాలకోట్’లో జరిగిన నష్టం ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్ చెరలో చిక్కిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన వర్థమాన్‌ను సురక్షితంగా విడుదల చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఇరు దేశాల మధ్య గత మూడు రోజులుగా నెలకొన్ని యుద్ధ మేఘాలు విడిపోయాయి. అయితే పలు చిక్కు ప్రశ్నలకు సమాధానాలు రావల్సి ఉంది. (అణు యుద్ధం వస్తే..?) 1. ఈ మూడు రోజులుగా దేశ సరిహద్దులో పాక్ నుంచి నిరంతరంగా కొనసాగుతున్న కాల్పులు, శతఘ్ని పేలుళ్లు నిలిచిపోతాయా? కాల్పులకు భయపడి ఉన్నఫలంగా సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చిన సరిహద్దు గ్రామాల ప్రజలు తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉందా? కశ్మీర్ లోపల గత కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోతాయా? 2. పాక్ భూభాగంలోని బాలకోట్ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దాడుల వల్ల జరిగిన ధ్వంసం ఏమిటీ? ఉగ్రవాదులు ఎంత మంది చనిపోయారు ? వారు తిరిగి కోలుకొని తమ ఉగ్రశిక్షణ కేంద్రాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉందా? భారత్ దాడితో పాక్ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా? ఇంతటితో ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వమే చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ విషయమై ఇరువర్గాలు ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను, ఆధారాలను వెల్లడించలేదు. 3. పాక్ జెట్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ఎలా చొచ్చుకు రాగలిగాయి? వాటిని తరముతూ వెళ్లిన భారత యుద్ధ విమానాన్ని పాక్ సైనికులు ఎలా పడగొట్టగలిగారు? 4. బుద్గామ్‌లో ఏడుగురు మరణానికి దారితీసిన భారత సైనిక విమానం మిగ్–17 కూలిపోవడానికి కారణం ఏమిటీ? (పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?) 5. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ తమ రాజకీయ కార్యకలాపాలను రద్దు చేసుకోగా, ప్రధాని నరేంద్ర సహా పాలకపక్ష బీజేపీ తమ రాజకీయ కార్యకలాపాలను ఎందుకు కొనసాగించారు? 6. అభినందన్‌ను పాక్ ప్రభుత్వం విడుదల చేయడం వెనక నిజంగా సౌదీ అరేబియా, అమెరికా ఒత్తిడి ఉందా? ఉన్నట్లయితే విదేశీ మీడియా ఈ అంశాన్ని పూర్తిగా ఎందుకు విస్మరించింది? 6. పాక్ భూభాగంపై ఉగ్రవాద శిక్షణా స్థావరాలను సమూలంగా నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ? వీటన్నింటికి సమాధానం దొరకాల్సి ఉంది. (‘అష్ట’దిగ్బంధనం..) -
‘చైనా కూడా మద్దతు ఇవ్వడం లేదు’
వాషింగ్టన్ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన జరిపిన దాడుల అనంతరం అంతర్జాతీయంగా తమకు మద్దతు లభించడం లేదని, అమెరికాలోని పాక్ మాజీ రాయబారి తెలిపారు. చైనా కూడా ఈ దాడులపై మాట్లాడటం లేదన్నారు. దీనికి పాక్.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని ప్రపంచ దేశాలు భావించడమే కారణమని, ఇది పాక్‌కు అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అత్యంత శక్తివంతమైన పాక్ ఆర్మీకి తరుచుగా రాడికల్ గ్రూప్‌ల నుంచి బెదిరింపులు వస్తుంటాయన్నారు. ప్రస్తుతం హడ్సన్ ఇన్స్టిట్యూట్ థింక్-ట్యాంక్ సౌత్ సెంట్రల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న హుక్కాని.. ఇటీవల రీ ఇమాజనింగ్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఇక ప్రపంచ దేశాలు పాక్‌కు అనుకూలంగాలేవన్న విషయం అంగీకరించదగినదేనని పాకిస్తాన్ స్కాలర్ మోయిద్ యూసఫ్ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచం మొత్తం భారత్‌కు అనుకూలంగా ఉంది. దీంతో భారత బలగాలు పాక్ భూభాగంలో చొరబడినా పెద్ద విషయం కాలేదు. ఇది పాకిస్తాన్‌కు పెద్ద సవాలే.’ అని చెప్పుకొచ్చారు. -
సర్జికల్ స్ట్రైక్ : పాకిస్తాన్‌పై కుళ్లు జోకులు
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా దాయాదీ దేశంపై కుళ్లు జోకులు పేలుతున్నాయి. పాక్‌ను టార్గెట్ చేస్తూ భారత నెటిజన్లు ఫన్నీ మీమ్స్, ట్వీట్స్, వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. #Surgicalstrike2, #Balakot, #IndiaStrikesBack, #IndianAirForce #airstrike యాష్ ట్యాగ్‌లతో పాక్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత సైన్యం జరిపిన దాడులకు పాక్ తోక ముడిచిందని, భయంతో చేతులెత్తిందని, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అయితే జ్వరం పట్టుకుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ దాడులపై క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం భారత వైమానిక దళాన్ని కొనియాడుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్లో భారత వైమానిక దళం మెరుపుదాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. 12 మిరాజ్-200 జైట్ ఫైటర్స్‌తో భారత వాయిసేన సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. Pakistanis right now 👇🏻😴#Surgicalstrike2 #Balakot #IndiaStrikesBack pic.twitter.com/8wtHHkIgbl — ⚽️ Raees Happu ⚽️💸🔫 (@HappuDroga2) February 26, 2019 Kids sent this on whatsapp 👇 👮♂️- “How’s the Jaish" ?? 🙋♀️🙋♂️”Dead Sir" #Surgicalstrike2 — Major Surendra Poonia (@MajorPoonia) February 26, 2019 #Surgicalstrike2 After second surgical strike by our India Air Force , 😂😂😂😂😂 How's the josh🇮🇳🇮🇳@ImranKhanPTI pic.twitter.com/U2kPPR9l7H — Kishlay Thakur (@kishlay_thakur) February 26, 2019 Meanwhile Porkistan Airforce is getting ready for retaliation 👇😂🙊#Surgicalstrike2 #Balakot #PKMKB #IndiaStrikesBack pic.twitter.com/blxxbDMDE3 — ChaŠhmiŠh..👿☀❤ (@Savage_Bae__) February 26, 2019 -
పాక్‌ను తగలబెట్టాలి: రాజా సింగ్
సాక్షి, హైదరాబాద్ : ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాయాదీ పాకిస్తాన్లో భారత వైమానిక దళం జరిపిన దాడులపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. భారత సైన్యాన్ని కొనియాడుతూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘పొద్దుగల పొద్దుగల మన భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి పోయి దాదాపు వెయ్యి కేజీల బాంబును పేల్చి వచ్చింది. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తామని మోదీ అన్నారు. అన్నట్లే చేశారు. ఈ ఘటనపై భారత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌కు భారత సైన్యం వారి రీతిలోనే జవాబిచ్చింది. భారత ప్రజలకు అభినందనలు. ఈ దాడులు జరిపిన భారత సైన్యానికి, ప్రధాని నరేంద్రమోదికి ధన్యవాదాలు. జస్ట్ ఇది సాంపిల్ మాత్రమే.. ఇంకా పాక్‌ను మొత్తం తగలబెట్టాలి. ఆ సమయం కూడా త్వరలో వస్తుంది.’ అని వ్యాఖ్యానించారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత వైమానిక దళం చేసిన మెరుపు దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. జైషే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. 12 మిరాజ్-200 జైట్ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 భారత వాయిసేన విజయవంతంగా పూర్తి చేసింది. చదవండి : సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం! -
పాక్‌ను తగలబెట్టాలి
-
మీ ఆట అదిరింది: సెహ్వాగ్
న్యూఢిల్లీ: పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో యావత్ భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లకు ఘన నివాళులర్పించిందని జాతి మొత్తం గర్విస్తోంది. భారత వైమానిక దళం చేసిన తాజా దాడుల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ జవాన్లు.. మీ ఆట అదిరింది’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్వీటర్ అకౌంట్లో అభినందించాడు. ఇందుకు ఎయిర్‌స్ట్రైక్ హ్యాష్ ట్యాగ్‌ను జోడించాడు. మరొక మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందిస్తూ.. ‘ భారత్ ఆర్మీకి ఇదే నా సెల్యూట్’ అని ట్వీట్ చేశాడు. ఇక గౌతం గంభీర్ ‘జై హింద్ ఐఎఎఫ్’ అంటూ ట్వీట్ చేశాడు. (ఇక్కడ చదవండి: సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం!) టీమిండియా యువ క్రికెటర్ యజ్వేంద్ర చహల్ భారత ఆర్మీని ప్రశంసించాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దేశం మొత్తాన్ని కలచివేసిన ఆ ఘటనకు ప్రతీకారంగానే ఉగ్రస్థావరాలపై భారత్ మరో మెరుపు దాడి చేసింది. ఈ ఘటనలో 200 నుంచి 300 వరకూ ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. The boys have played really well. #SudharJaaoWarnaSudhaarDenge #airstrike — Virender Sehwag (@virendersehwag) 26 February 2019 JAI HIND, IAF 🇮🇳 @IAF_MCC @adgpi #IndiaStrikesAgain #IndiaStrikesBack #IndiaStrikes — Gautam Gambhir (@GautamGambhir) 26 February 2019 Salute to the Indian Air Force. Shaandaar #IndiaStrikesBack — Mohammad Kaif (@MohammadKaif) 26 February 2019 Indian Air Force 🇮🇳👏 Bohot Hard Bohot Hard #IndiaStrikesBack #JaiHind 🇮🇳🇮🇳 — Yuzvendra Chahal (@yuzi_chahal) 26 February 2019 -
ఇస్లామిక్ స్టేట్‌కు గట్టి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో ఆ సంస్థ కీలక నేత ఇబ్రహీం అల్-అన్సారీ హతమయ్యాడు. బాగ్దద్లో సంకీర్ణ సేనలకు నేతృత్వం వహిస్తున్న కల్నల్ జోఫ్ఫ్ స్క్రోక్కా గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించే ఇస్లామిక్ స్టేట్ ప్రచార కార్యక్రమాల్లో అల్-అన్సారీ కీలక వ్యక్తి అని జోసఫ్ తెలిపారు. విదేశీయులను ఇస్లామిక్ స్టేట్లోకి ఆకర్షించడం, పశ్చిమ దేశాలపై దాడులను ప్రోత్సహించడంలో అల్-అన్సారీ పాత్ర ఉందని ఆయన వెల్లడించారు. పశ్చిమ ఇరాక్‌లోని అల్-క్వైమ్ పట్టణంలో జరిగిన ఈ వైమానిక దాడుల్లో అల్- అన్సారీతో పాటు.. నలుగురు ఇస్లామిక్ స్టేట్ మల్టీ మీడియా ఆపరేషన్ టీంకు చెందిన వారు హతమయ్యారని భద్రతా అధికారులు వెల్లడించారు. -
సిరియా జైలుపై వైమానిక దాడి: 16 మంది మృతి
బీరట్: సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ఇడ్లిబ్ నగరంలోని ఓ జైలుపై శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో 16 మంది మరణించారు. మృతుల్లో జైలు ఖైదీలు, సిబ్బంది కూడా ఉన్నారని సిరియాలోని ఓ మానవ హక్కుల సంస్థ తెలిపింది. రష్యా దళాలు ఈ వైమానిక దాడి చేసినట్లు భావిస్తున్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు రష్యా.. తిరుగుబాటు చేస్తున్న ప్రతిపక్షానికి టర్కీ మద్దతుగా ఉండటం తెలిసిందే. దాడి అనంతరం జైలు నుంచి కొంతమంది ఖైదీలు పారిపోతుండగా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లోనూ కొంతమంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. ఇడ్లిబ్ నగరంపై సిరియా, రష్యా, అమెరికా సంకీర్ణ దళాలు తరచుగా దాడులు చేస్తుంటాయి. సిరియాలో ఆరేళ్ల క్రితం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఘర్షణల్లో 3.2 లక్షల మంది మరణించారు. -
యెమెన్ లో వైమానిక దాడులు
82 మంది దుర్మరణం సనా: తిరుగుబాటుదారుల అధీనంలోని యెమెన్ రాజధాని సనాపై శనివారం సౌదీ సంకీర్ణ సేనల వైమానిక దాడితో ఓ ప్రాంతం మరుభూమిగా మారింది. ఈ దాడిలో సనా స్థానిక మండలి అధినేత, మేజర్ జనరల్ అబ్దుల్ ఖాదర్ హిలాల్సహా 82 మంది ప్రాణాలు కోల్పోయారు. చెల్లాచెదురుగా పడిన మృతుల శరీరభాగాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఈ దాడి ఘటనలో దాదాపు 534 మంది గాయపడ్డారు. సనాలోని ఓ భవంతిలో అంత్యక్రియల్లో వందలాది మంది పాల్గొన్న సమయంలో ఈ వైమానిక దాడి జరిగింది. మరణించిన, గాయపడిన వారిలో హాతీ తిరుగుబాటుపాలనకు చెందిన సైన్యాధికారులు, భద్రతాధికారులు కూడా ఉన్నారు. -
అలెప్పోపై వైమానిక దాడుల్లో 52 మంది మృతి
అలెప్పో: తిరుగుబాటు దారుల అధీనంలో ఉన్న సిరియా నగరం అలెప్పోలో శనివారం ప్రభుత్వం జరిపిన వైమానిక దాడుల్లో 52 మంది పౌరులు మరణించారు. కాల్పుల విరమణ కోసం రాయబారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం ఫిరంగులు, వైమానిక దాడులు చేసి, చేయిజారిపోయిన నగరాన్ని తిరిగి తన అధీనంలోకి తీసుకోడానికి ప్రయత్నించింది. ఈ దాడులపై అంతర్జాతీయ సమాజం మౌనం వహించిందంటూ సిరియా ప్రధాన ప్రతిపక్షం నిరసన తెలిపింది. సిరియా, రష్యాలు కలిసి అలెప్పోలో నేరానికి పాల్పడుతున్నాయంది. ప్రజలు శిథిలాల్లో చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ కేంద్రం పేర్కొంది. ఆహారం కొనడానికి ఒక అంగడి ముందు వరుసలో నిల్చున్న ఏడుగురు సామాన్యులు ఈ దాడుల్లో మరణించారు. కొన్ని వీధులు నామరూపాల్లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అలెప్పోలో శుక్రవారం నాటి దాడుల్లో 47 మంది మరణించారు. పేలని రాకెట్లు ఇంకా వీధుల్లో అలాగే పడి ఉన్నాయి. ‘వైట్ హెల్మెట్స్’ అనే ప్రజా రక్షణ సంస్థ భవనం తీవ్రంగా ధ్వంసమైంది. మిగతా భవంతులన్నీ పూర్తిగా నేలమట్టమైపోయాయి. అలెప్పో నగరంలో రెండే అగ్ని మాపక వాహనాలున్నాయని, అవి నగరం మొత్తానికి తిరగడం కష్టంగా ఉందని ఈ కేంద్రం పేర్కొంది. విద్యుత్, ఇంధనం లేకపోవడంతో అలెప్పో అంధకారంలో చిక్కుకుపోయింది. శుక్రవారం ఉదయం వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. స్థానికులు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. -
ఇస్లామిక్ స్టేట్‌కు దెబ్బ మీద దెబ్బ
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన టాప్ లీడర్‌ను అమెరికా మట్టుబెట్టింది. ఉగ్రవాదుల తాకిడి అధికంగా ఉండే అన్బార్ ప్రావిన్స్ చీఫ్ ఉన్న అబూ వాహిబ్ అనే ఉగ్రవాది, మరో ముగ్గురు అనుచరులు అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఈ విషయం పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్ తెలిపారు. అబు వాకర్ ఒకప్పుడు అల్ కాయిదా ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా ఉండేవాడు. అనంతరం ఇస్లామిక్ స్టేట్ లో చేరి పలు దాడులకు ఎన్నో ప్రణాళికలు రచించారు. దీంతో అతడినే లక్ష్యంగా చేసుకున్న అమెరికా వైమానిక బలగాలు అతడి జాడను గుర్తించి రూత్బా అనే ప్రాంతంపై దాడులు నిర్వహించగా అతడు ప్రాణాలుకోల్పోయాడు. నాయకత్వం లేకుండా చేస్తే ఆ ఉగ్రవాద సంస్థను పూర్తిగా నాశనం చేయొచ్చన్న తమ వ్యూహంలో భాగంగా అమెరికా వాయు సేనలతో కలిసి చేస్తున్న దాడులతో సాధించిన ఈ విజయం మరో గొప్ప అంశమని, మున్ముందు ఇలాంటివి మరిన్ని చేస్తామని ఇరాక్ సైనికాధికారి ఒకరు చెప్పారు. -
సిరియా ఉగ్రవాదులపై ఆసిస్ సమరశంఖం
సిరియా: ఆస్ట్రేలియా తొలిసారి సిరియాలోని ఉగ్రవాదులపై సమర శంఖం పూరించింది. ఆ దేశానికి చెందిన యుద్ధ విమానాలు సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై తొలిదాడి చేసింది. అయితే, నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే, దాడి జరిపిన విషయాన్ని మాత్రం ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి కెవిన్ ఆండ్రూస్ స్పష్టం చేశారు. ఈ దాడుల ద్వారా దాయిష్ ఉగ్రవాదులు తరలిస్తున్న మందుగుండు సామాగ్రి వాహనాన్ని ఒక ప్రత్యేక క్షిఫణి ద్వారా ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం అధికంగా ఉండే తూర్పు సిరియా ప్రాతంపై ఈ దాడి జరిపనట్లు తెలిపారు. అయితే, సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. అదే సమయంలో తమ యుద్ధ విమానాలు ఉగ్రవాదులు జరిపే ఎదురు దాడులకు ధ్వంసం కావని, ఎలాంటి అగ్ని ప్రమాదాన్ననైనా తట్టుకునేలా తమ జెట్ యుద్ధ విమానాలు ఉన్నట్లు చెప్పారు. ఉగ్రవాదులను అణిచివేసే చర్యలకోసం అంతకుముందు జరిగిన ఒప్పందంతోపాటు సిరియాకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఉత్తర బాగ్దాద్‌లో ఇలాంటి దాడులు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా వైమానిక దాడులు
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల మీద ఆస్ట్రేలియా కూడా దాడులు మొదలుపెట్టింది. ఎఫ్-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్‌తో రెండు ఉగ్రవాద స్థావరాలపై బాంబులు కురిపించడంతో ఈ దాడి మొదలైంది. బుధవారం రాత్రే ఆస్ట్రేలియా వైమానిక దాడులను మొదలుపెట్టిందని సిన్హువా వార్తా సంస్థ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాలపై బాంబులు వేశారని, లక్ష్యాన్ని ఛేదించడానికి వెళ్లిన ఫైటర్ విమానాలన్నీ సురక్షితంగా వైమానిక స్థావరానికి తిరిగొచ్చాయని వివరించింది. వాస్తవానికి ఇన్నాళ్లూ ఐఎస్ మీద చర్యలకు ఆస్ట్రేలియా మద్దతు ఇచ్చినా, ప్రత్యక్షంగా పోరాటంలోకి దిగడం మాత్రం ఇదే మొదటిసారి. వినువీధి నుంచి బాంబులు కురిపించడంతో పాటు ఇరాకీ దళాలకు శిక్షణ, సలహాలు ఇవ్వడానికి 200 మందితో కూడిన ఓ దళాన్ని కూడా పంపాలని ఆస్ట్రేలియా యోచిస్తోంది. ఇంతకుముందు 2009 జూలై నెలలో మాత్రమే ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ (ఏడీఎఫ్) దళాలు ఇరాక్‌తో యుద్ధానికి దిగాయి.