ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల మీద ఆస్ట్రేలియా కూడా దాడులు మొదలుపెట్టింది. ఎఫ్-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్తో రెండు ఉగ్రవాద స్థావరాలపై బాంబులు కురిపించడంతో ఈ దాడి మొదలైంది. బుధవారం రాత్రే ఆస్ట్రేలియా వైమానిక దాడులను మొదలుపెట్టిందని సిన్హువా వార్తా సంస్థ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాలపై బాంబులు వేశారని, లక్ష్యాన్ని ఛేదించడానికి వెళ్లిన ఫైటర్ విమానాలన్నీ సురక్షితంగా వైమానిక స్థావరానికి తిరిగొచ్చాయని వివరించింది.
వాస్తవానికి ఇన్నాళ్లూ ఐఎస్ మీద చర్యలకు ఆస్ట్రేలియా మద్దతు ఇచ్చినా, ప్రత్యక్షంగా పోరాటంలోకి దిగడం మాత్రం ఇదే మొదటిసారి. వినువీధి నుంచి బాంబులు కురిపించడంతో పాటు ఇరాకీ దళాలకు శిక్షణ, సలహాలు ఇవ్వడానికి 200 మందితో కూడిన ఓ దళాన్ని కూడా పంపాలని ఆస్ట్రేలియా యోచిస్తోంది. ఇంతకుముందు 2009 జూలై నెలలో మాత్రమే ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ (ఏడీఎఫ్) దళాలు ఇరాక్తో యుద్ధానికి దిగాయి.
ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా వైమానిక దాడులు
Published Thu, Oct 9 2014 10:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM
Advertisement
Advertisement