ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)ను అణిచివేసే చర్యల్లో భాగంగా ఇరాక్కు మరో300 మంది సైన్యం తరలి వెళ్లింది. వీళ్లంతా ఇరాక్లోని సైన్యానికి ఉగ్రవాదులతో తలపడే విధానంలో శిక్షణను ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు టోనీ అబాట్ తెలిపారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు కలిసి ఉమ్మడిగా ఈ శిక్షణ కార్యక్రమానికి ఒప్పుకున్నాయి. ఇందులో 143 మంది న్యూజిలాండ్ సైన్యం ఇప్పటికే శిక్షణను ఇస్తుండగా మరోపక్క 200మంది ఆస్ట్రేలియా సైన్యం కూడా అదే పనిలో ఉంది. మరింతమంది శిక్షకులను పంపించాలని ఇరాక్ సైనికాధికారులు కోరడంతో అదనంగా 300 మందిని ఆస్ట్రేలియా పంపించింది.
ఈ విషయంపై అబాట్ మాట్లాడుతూ ఇప్పటికే తాము ఐఎస్ ఉగ్రవాదులను అణిచివేసి ఎంజాయ్ చేస్తున్నామని, ఇరాక్ ఈ పనిచేసేందుకు మరింత తోడ్పాటు, శక్తి అవసరం ఉందని చెప్పారు. ఆ మేరకు శక్తి తమ నుంచి వారికి అందుతుందని చెప్పారు.