ఇరాక్లో బాంబుదాడి.. 23మంది మృతి | 23 killed in Iraq attacks | Sakshi
Sakshi News home page

ఇరాక్లో బాంబుదాడి.. 23మంది మృతి

Published Fri, Nov 27 2015 7:51 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

ఇరాక్లో బాంబుదాడి.. 23మంది మృతి

ఇరాక్లో బాంబుదాడి.. 23మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్లో రెండు వేర్వేరుచోట్ల బాంబు దాడులు చోటుచేసుకొని 23మంది ప్రాణాలుకోల్పోయారు. వీరిలో 17మంది ఇరాక్ సైనికులు ఉండగా మిగితావారు ఉగ్రవాదులు. ఇరాక్ లోని అన్బార్ ప్రావిన్స్లో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జుబ్బా ప్రాంతంలో తొలిదాడి ఆత్మాహుతి దాడి రూపంలో జరిగింది.

ఒంటినిండా బాంబులతో కూడిన జాకెట్ ధరించి వచ్చిన ఓ ఉగ్రవాది ఒక్కసారికా సైనికులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి చొచ్చుకొచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 17మంది ప్రాణాలుకోల్పోయారు. మరోచోట ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని ఓ విదేశీ యుద్ధవిమానం జరిపిన దాడిలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement