
కీవ్: శాంతి చర్చల వేళ రష్యా సైన్యం(Russia Military) భీకర దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. తాజాగా.. రాజధాని కీవ్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ తెలిపారు. అయినప్పటికీ..
తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులు శాంతి చర్చలు(Ukraine Peace Talks) జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచడం గమనార్హం.
రెండు రోజుల కిందట ఖర్‌కీవ్ రీజియన్‌లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ప్రకటించారాయన.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌కు అమెరికా నిఘా సమాచార సహాయం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే రష్యా తన దాడుల ఉధృతిని పెంచడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment