యెమెన్ లో వైమానిక దాడులు
82 మంది దుర్మరణం
సనా: తిరుగుబాటుదారుల అధీనంలోని యెమెన్ రాజధాని సనాపై శనివారం సౌదీ సంకీర్ణ సేనల వైమానిక దాడితో ఓ ప్రాంతం మరుభూమిగా మారింది. ఈ దాడిలో సనా స్థానిక మండలి అధినేత, మేజర్ జనరల్ అబ్దుల్ ఖాదర్ హిలాల్‌సహా 82 మంది ప్రాణాలు కోల్పోయారు. చెల్లాచెదురుగా పడిన మృతుల శరీరభాగాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఈ దాడి ఘటనలో దాదాపు 534 మంది గాయపడ్డారు. సనాలోని ఓ భవంతిలో అంత్యక్రియల్లో వందలాది మంది పాల్గొన్న సమయంలో ఈ వైమానిక దాడి జరిగింది. మరణించిన, గాయపడిన వారిలో హాతీ తిరుగుబాటుపాలనకు చెందిన సైన్యాధికారులు, భద్రతాధికారులు కూడా ఉన్నారు.