వాషింగ్టన్ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన జరిపిన దాడుల అనంతరం అంతర్జాతీయంగా తమకు మద్దతు లభించడం లేదని, అమెరికాలోని పాక్ మాజీ రాయబారి తెలిపారు. చైనా కూడా ఈ దాడులపై మాట్లాడటం లేదన్నారు. దీనికి పాక్.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని ప్రపంచ దేశాలు భావించడమే కారణమని, ఇది పాక్‌కు అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
అత్యంత శక్తివంతమైన పాక్ ఆర్మీకి తరుచుగా రాడికల్ గ్రూప్‌ల నుంచి బెదిరింపులు వస్తుంటాయన్నారు. ప్రస్తుతం హడ్సన్ ఇన్స్టిట్యూట్ థింక్-ట్యాంక్ సౌత్ సెంట్రల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న హుక్కాని.. ఇటీవల రీ ఇమాజనింగ్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఇక ప్రపంచ దేశాలు పాక్‌కు అనుకూలంగాలేవన్న విషయం అంగీకరించదగినదేనని పాకిస్తాన్ స్కాలర్ మోయిద్ యూసఫ్ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచం మొత్తం భారత్‌కు అనుకూలంగా ఉంది. దీంతో భారత బలగాలు పాక్ భూభాగంలో చొరబడినా పెద్ద విషయం కాలేదు. ఇది పాకిస్తాన్‌కు పెద్ద సవాలే.’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment