‘‘ఇప్పుడు ఏ సమాచారం, వార్త కోసం అయినా ముందు వెతుకుతున్నది డిజిటిల్ మీడియాలోనే. అలాంటి డిటిజల్ మీడియాలో ప్రమోషన్స్ చేయడం వైవిధ్యం. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్న ‘అమీర్‌పేట్ టు అమెరికా’ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బ్రహ్మానందం, మణిచందన, సమ్మెట గాంధీ, రజని, వేణుగోపాల్, వేణు మాధవ్ ప్రధాన పాత్రల్లో రామ్మోహన్ కొమండూరి, భానుకిరణ్ చల్లా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎ టు ఎ’(అమీర్‌పేట్ టు అమెరికా).
తమ సినిమా విశేషాలను పంచుకునేందుకు, ప్రమోషన్‌కు ‘ఎ టు ఎ’’ టీమ్ రూపొందించిన యాప్‌ని తలసాని విడుదల చేశారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. షూటింగ్ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. తేజస్, పల్లవి దొర, మేఘనా లోకేష్, వంశీకృష్ణ, వైవా హర్ష తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: స్వప్న కొమండూరు, కెమెరా: అరుణ్ ఐ.కె.సి, జి.ఎల్.బాబు, సంగీతం: కార్తీక్ కొడకండ్ల.
Comments
Please login to add a commentAdd a comment