meghana lokesh
-
నాకెవ్వరూ లేరు.. చచ్చిపోతానంటూ నటి మేఘన! వీడియో వైరల్
ప్రస్తుతం బుల్లితెర, టీవీ స్టార్స్ సీరియల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ అలరిస్తున్నారు. సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే నటి అంజలి, మహేశ్వరి, శ్రీవాణి, బిగ్‌బాస్ నటి హిమజ, అషురెడ్డితో పాటు పలువురు నటీనటులు సొంతంగా యూట్యూబ్ చానల్ రన్ చేస్తున్నారు. తరచూ హోంటూర్, డైలీ రోటిన్ వీడియోస్‌తోపాటు డిఫరెంట్ కంటెంట్‌తో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు తమ కో-స్టార్స్‌కి ప్రాంక్ చేసి ఆటపట్టించి ఏడిపిస్తుంటారు. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే తాజాగా టీవీ నటి మేఘన లోకేశ్ కూడా తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. రీసెంట్గా యూట్యూబ్ చానల్‌ను ఓపెన్ చేసిన ఆమె తాజాగా తన కో-స్టార్స్, ఫ్రెండ్‌ని ప్రాంక్కాల్తో చెమటలు పెట్టించింది. నాకు ఎవ్వరూ లేరు అంటూ మేఘన ఈ వీడియో షేర్ చేసింది. ఇక సీరియల్ షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉండే మేఘనా ఖాళీగా ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. బోర్ కొట్టడంతో ఫ్రెండ్స్‌కి ప్రాంక్ కాల్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి.. వరుడు అతనే ఈ క్రమంలో తన ఫ్రెండ్స్, నటి స్వర్ణకి కాల్ చేసి ‘ఇంట్లో ఎవరూ లేరు. నీరసంగా అనిపిస్తోంది. చచ్చిపోతానేమో’ అని అమాయకంగా మాట్లాడింది. దీంతో నటి స్వర్ణ తెగ కంగారు పడిపోయింది. ఇప్పుడే వచ్చేస్తా.. కాల్ కట్ చేయొద్దని భయపడిపోయింది. చివర్లో.. ఇది ప్రాంక్ అని మేఘన చెప్పడంతో ఆమె రిలాక్స్ అయ్యింది. అయినప్పటికీ మేఘన చేసిన పనికి ఆమెకు భయంతో చెమటలు పట్టాయి. అంతేకాదు ఒక్కసారిగా ఆమె కన్నీరు పెట్టుకుంది. చివరికి నేను బాగానే ఉన్నాను అంటూ వీడియో కాల్ చేసి మాట్లాడింది మేఘన. -
నిత్యమైన మంగ
తెలుగు వారింట ‘శశిరేఖ’గా అడుగుపెట్టి ఇంటిల్లిపాదితో ‘మంగతాయారు’గా ముచ్చట్లుచెప్పి ‘నిత్య’మై వెలుగొందుతున్న మేఘనా లోకేష్ జీ తెలుగులో ‘కళ్యాణవైభోగం, రక్తసం బంధం’ సీరియల్స్‌లో నటిస్తున్నారు. తెలుగువారు మెచ్చిన మేఘన చెబుతున్న ముచ్చట్లు ఇవి. ‘‘సీరియల్స్ అంటే ఏడుపు మాత్రమే ఉంటుందనుకునే రోజులు కావివి. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో, తమ జీవితాలతో పాటు కుటుంబ బంధాలను ఎలా సరిదిద్దుతారో చూపుతున్నారు. ఆరేళ్లుగా బుల్లితెర నటిగా ఉంటున్న నాకు నేను నటించిన పాత్రలన్నీ ఎంతో మంచిని నేర్పిస్తూనే ఉన్నాయి. స్ట్రాంగ్‌గా మార్చిన పాత్రలూ ఉన్నాయి. నేను పుట్టిపెరిగింది అంతా మైసూరులోనే. కన్నడ అమ్మాయిని. ఆరేళ్ల క్రితం వరకు చదువు, స్టేజ్ షోలే లోకంగా ఉండేవి. చదువు పూర్తి చేశాను. చదువుతో పాటు స్టేజ్ షోల పట్ల కూడా నాకు ఆసక్తి ఉండేది. నేను వృద్ధిలోకి రావడానికి మా నాన్న చాలా త్యాగాలు చేశారు. స్టేజ్ షోస్‌లో పాల్గొనేటప్పుడు ఆ షోస్ కోసం రోజూ 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, తీసుకొచ్చేవారు. టీవీ సీరియల్స్‌లో అవకాశం వచ్చినప్పుడు నాన్న కాస్త డౌట్‌గానే ఓకే చెప్పారు. అయితే, పని పట్ల శ్రద్ధ అవసరం అని తరచూ చెబుతుండేవారు. కన్నడ సీరియల్లో నటించినప్పుడు ఆ రోల్‌కి అవార్డ్ రావడంతో నాన్నకు ధైర్యం వచ్చింది. తర్వాత వచ్చిన సీరియల్స్ అవకాశాలకు ఓకే చెప్పారు. అలా ఈ రంగంలో ఆరేళ్ల నుంచి వున్నాను. సీ‘రియల్ మలుపులు’... సీరియల్స్‌లో కొన్ని ఊహించని మలుపులు ఉంటాయి. అలాగే నా జీవితంలోనూ ఓ మలుపు.. కిందటేడాది క్యాన్సర్ వచ్చి నాన్న నాకు దూరమయ్యారు. క్యాన్సర్ ఉన్నట్టుగా 5–6 నెలల వరకు నాకీ విషయం తెలియనివ్వలేదు నాన్న. రక్తసంబంధం, కళ్యాణవైభోగం సీరియల్‌తో సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండి మైసూరుకు ఎక్కువ వెళ్లేదాన్ని కాదు. నా వర్క్ ఎక్కడ డిస్ట్రబ్ అవుతుందో అని నాకా విషయం చెప్పద్దన్నారట నాన్న. క్యాన్సర్ చివరి స్టేజ్‌లో నాకా విషయం తెలిసింది. అప్పటికే ఆలస్యం అయ్యింది. నాకు అమ్మ, అన్నయ్య, అమ్మమ్మ ఉన్నారు. ఎప్పుడు పెళ్లి అనే ఆలోచన వచ్చినా నాకు ఓ సమాధానం వస్తుంది. మా నాన్నలా నన్ను కేరింగ్‌గా, ప్రొటెక్టివ్‌గా చూసుకోవాలని. అంతగా లేకపోయినా ప్రేమగా ఉంటే చాలు అనుకుంటున్నాను. నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఉన్నవారు కూడా వేరే వేరే చోట్లలో వారి పనుల్లో బిజీ. నేనే మైసూర్ వెళ్లినప్పుడు వారిని కలుస్తుంటాను. ఈ మధ్య ఏడాదికి ఒకసారి స్నేహితులంతా కలిసేలా ప్లాన్ చేసుకున్నాం. సీరియల్స్ అంటే ఏడుపు సీన్లు కాదు చాలా వరకు సీరియల్ నటి అనగానే ఏడుపు సీన్లు ఉంటాయి అంటారు. ఇప్పుడు అలాంటివేవీ లేవు. సీరియల్స్‌లోనూ చాలా మార్పులు వచ్చాయి. రక్తసంబంధం సీరియల్లో తులసి క్యారెక్టర్‌నే తీసుకుంటే తను చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ తరానికి బాగా కనెక్ట్ అయిన పాత్ర అది. స్టోరీ డ్రామా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కళ్యాణ వైభోగం సీరియల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. నిత్య–మంగగా రెండూ రెండు భిన్న పాత్రలు. ఇదో సవాల్‌లా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. తెలుగువారు మెచ్చిన మంగతాయారు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఇష్టమైనవే. అయితే, ‘కళ్యాణవైభోగం’ మంగతాయారు పాత్ర అంటే ఇంకా ఇష్టం. మంగ చాలా అమాయకురాలు. అప్పటివరకు ఓ పల్లెటూరు అమ్మాయి ఎంత అమాయకంగా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి ఆ అమ్మాయిలో తర్వాత తర్వాత చాలా ప్రతిభ కనిపిస్తుంటుంది. ఇల్లాలిగా, త్యాగమయిగా.. తనను తాను చాలా మార్చుకుంటూ ప్రూవ్ చేసుకుంటుంది. అన్ని వయసుల వారూ ఈ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతారు. మంగతాయారు పాత్ర ద్వారా నా జీవితంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ పాత్ర–నేనూ వేరు కాదని అనిపిస్తుంటుంది. శశిరేఖగా అందరికీ పరిచయం అయినా ఈ పాత్ర వల్ల తెలుగువారింట నేనూ ఓ కుటుంబసభ్యురాలినైపోయాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.’’ నిర్మలారెడ్డి -
ఎ టు ఎ మంచి విజయం సాధించాలి – మంత్రి తలసాని
‘‘ఇప్పుడు ఏ సమాచారం, వార్త కోసం అయినా ముందు వెతుకుతున్నది డిజిటిల్ మీడియాలోనే. అలాంటి డిటిజల్ మీడియాలో ప్రమోషన్స్ చేయడం వైవిధ్యం. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్న ‘అమీర్‌పేట్ టు అమెరికా’ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బ్రహ్మానందం, మణిచందన, సమ్మెట గాంధీ, రజని, వేణుగోపాల్, వేణు మాధవ్ ప్రధాన పాత్రల్లో రామ్మోహన్ కొమండూరి, భానుకిరణ్ చల్లా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎ టు ఎ’(అమీర్‌పేట్ టు అమెరికా). తమ సినిమా విశేషాలను పంచుకునేందుకు, ప్రమోషన్‌కు ‘ఎ టు ఎ’’ టీమ్ రూపొందించిన యాప్‌ని తలసాని విడుదల చేశారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. షూటింగ్ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. తేజస్, పల్లవి దొర, మేఘనా లోకేష్, వంశీకృష్ణ, వైవా హర్ష తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: స్వప్న కొమండూరు, కెమెరా: అరుణ్ ఐ.కె.సి, జి.ఎల్.బాబు, సంగీతం: కార్తీక్ కొడకండ్ల. -
నాగార్జునగారంటే ఇష్టం
యాంకర్ రవి హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ఇది మా ప్రేమకథ’. ‘శశిరేఖా పరిణయం’ సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయిక. అయోధ్య కార్తీక్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పి.ఎల్.కె. రెడ్డి, దినేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేఘన లోకేష్ పంచుకున్న చిత్ర విశేషాలు... ► ‘ఇది మా ప్రేమకథ’ నా తొలి సినిమా. ‘శశిరేఖా పరిణయం’ సీరియల్ చూసి కార్తీక్‌గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన కథ చెప్పినప్పుడు ప్లెయిన్‌గా అనిపించింది. కానీ, నేను చేస్తేనే బాగుంటుందంటూ ఆయన కన్విన్స్ చేయడంతో చేశా. ► ఇదొక లవ్ స్టోరీ. ప్రేమించుకోవడానికి సరైన వయసు ఏది? ప్రేమికులు ఎందుకు విడిపోతున్నారు? ఓ సమస్యను లవర్స్ ఇద్దరూ ఎందుకు వేర్వేరుగా చూస్తున్నారు? ఇద్దరూ ఒకేలా చూస్తే సమస్య ఉండదు కదా? అని చూపించారు. నా పాత్ర పేరు సంధ్య. చాలా నార్మల్‌గా ఉంటుంది. చిన్న బడ్జెట్లో చక్కగా తీశారు. మూవీ సింపుల్‌గా, సహజంగా ఉంటుంది. ► సీరియల్స్, సినిమాలు ఎంజాయ్ చేస్తున్నా. రెండిట్లోనూ కష్టాలు, సుఖాలు ఉన్నాయి. నేను సీరియల్స్ నుంచే వచ్చాను కాబట్టి ఎప్పటికీ వాటిని మర్చిపోను. హీరోయిన్ అయినా మంచి కథలు వస్తే తప్పకుండా సీరియల్స్ చేస్తూనే ఉంటా. ► తెలుగులో హీరో నాగార్జునగారు, హీరోయిన్ సౌందర్యగారంటే ఇష్టం. నా మాతృ భాష కన్నడలో గతంలో ఒక సినిమా ఆఫర్ వచ్చింది. కంటిన్యూస్‌గా మూడు నెలలు డేట్స్ అడిగారు. అప్పుడు సీరియల్స్‌తో బిజీగా ఉండటంతో చేయలేదు. ఇప్పుడు చాన్స్ వచ్చే చేస్తా. -
శశిరేఖా పరిచయం
ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. ఈ ఫార్ములా మన బుల్లితెర శశిరేఖకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. శశిరేఖా పరిణయం సీరియల్‌తో ఈ ముద్దుగుమ్మకు ఏడాది కిందట భాగ్యనగరితో ముడిపడింది. మైసూరులో పుట్టి పెరిగిన మేఘనా లోకేశ్.. కన్నడ సీమలో సత్తా చాటి తెలుగింటికి చే రుకుంది. హైదరాబాద్ పరిచయమై ఏడాదే అయినా.. అనుబంధం మాత్రం ఎంతో ఘనమైందని చెబుతోంది. సిటీతో తనకున్న పరిచయాన్ని ‘సిటీ ప్లస్’తో పంచుకుంది. - మేఘనా లోకేశ్, టీవీ నటి మాది మైసూరు. మా నాన్న ఇంజనీర్‌గా పనిచేశారు. మా అమ్మ లెక్చరర్‌గా వర్క్ చేసింది. నా స్కూలింగ్ అంతా మైసూరులోనే. ఎనిమిదేళ్ల వయసు నుంచే నాటకాల్లో పాల్గొనేదాన్ని. అలా మొదలైన నా నటప్రస్థానం కన్నడ సీరియల్స్ దాటి.. తెలుగువారి ముందుకు తెచ్చింది. అన్నపూర్ణ బ్యానర్‌పై శశిరేఖా పరిణయం సీరియల్లో లీడ్ రోల్ పోషించే చాన్స్ వచ్చింది. దాంతో హైదరాబాద్‌కు వచ్చేశాను. చిన్నప్పటి నుంచీ అంతే.. స్కూల్‌కు చాలా ఇష్టంగా వెళ్లేదాన్ని. బాగా చదివేదాన్ని కూడా. అయితే అలా లాస్ట్ బెల్ కొట్టగానే ఇలా బ్యాగ్ సర్దేసేదాన్ని. హోమ్‌వర్క్ కూడా అస్సలు చేసేదాన్ని కాదు. ఎంతసేపు.. ఆటలు, పాటలు, కల్చరల్ యాక్టివిటీస్..! వీటి మీదే ఇంట్రెస్ట్ చూపేదాన్ని. నాటకాలంటే ఇష్టమే కానీ, నటినవ్వాలని ఎన్నడూ అనుకోలేదు. చదువుకునే రోజుల్లో ఏ టీచర్నో.. లెక్చరర్నో కావాలనుకున్నాను. నాకో అన్నయ్య ఉన్నాడు. తను చదువుల్లో పర్ఫెక్ట్. నేను చేసే అల్లరి పనులు తన కంటబడితే.. వెంటనే ఇంట్లో వాళ్లకు కంప్లయింట్ చేసేవాడు. దసరా సరదా భలే.. శశిరేఖా పరిణయం సీరియల్లో నటించడం కోసం మొదటిసారి నేను హైదరాబాద్ వచ్చాను. మైసూరుతో పోలిస్తే హైదరాబాద్ వెరీ డిఫరెంట్ సిటీ. నాకైతే మైసూర్, బెంగళూర్ కలగలిస్తే హైదరాబాద్‌లా ఉంటుందనిపించింది. కొత్త ప్లేస్ అయినా చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యాను. ఇక్కడి కల్చర్ చాలా గొప్పగా అనిపించింది. ఇన్నేళ్లూ దసరా పండుగ మైసూరులోనే ఘనంగా జరుగుతుందని అనుకునేదాన్ని. కానీ, భాగ్యనగరంలో కూడా ఈ ఫెస్టివల్ ఇంత సంబరంగా చేస్తారని ఇప్పుడే తెలిసింది. మెట్రో కల్చర్‌కు అలవాటుపడిన సిటీలో బతుకమ్మ పాటలు, దాండియా ఆటలు నన్ను అబ్బురపరిచాయి. పదహారణాల తెలుగందం ఎలా ఉంటుందో బతుకమ్మ ఫెస్టివల్లో చూశాను. చీరలు, పట్టు పరికిణీలు.. నగలు.. పూలు.. అమ్మాయిలందరూ కలర్ఫుల్గా కనిపించారు. బతుకమ్మ పండుగను నేను కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. నేను సిటీకి వచ్చి ఏడాదే అయినా.. ఇక్కడి కల్చర్‌కు ఎడిక్ట్ అయిపోయాను. హైదరాబాద్ నాకు రెండో పుట్టిల్లులా అనిపిస్తుంటుంది. సిటీ చుట్టేస్తా.. నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మే. తీరిక దొరికితే అమ్మతో కలసి సిటీ చుట్టేస్తుంటాను. మొదటిసారి చార్మినార్ చూసినపుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇక అక్కడ షాపింగ్ చేస్తుంటే అస్సలు టైం తెలియదు. రాత్రి వేళల్లో రంగురంగుల విద్యుత్ దీపకాంతుల్లో మెరిసిపోయే బిర్లామందిర్ సూపర్బ్‌గా ఉంటుంది. బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12 లోని జగన్నాథస్వామి ఆలయానికి కూడా తరుచూ వెళ్తుంటాను. తొందర్లోనే వండేస్తా.. రుచుల విషయానికి వస్తే.. హైదరాబాదీ వంటకాలు స్పైసీగా.. టేస్టీగా భలే ఉంటాయి. బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. కిచెన్ ఆఫ్ కూచిపూడి రెస్టారెంట్లో నాలుగైదు రకాల వెరైటీ బిర్యానీలు టేస్ట్ చేశాను. అంతేకాదు.. నిజామీ ఫ్లేవర్ ఉన్న వంటకాల గురించి నెట్లో సెర్చ్ చేస్తున్నాను. బుక్స్ చదివి మరీ ఆ ఘుమఘుమల గురించి తెలుసుకుంటున్నాను. తొందర్లోనే ఆ వెరైటీలు వండేస్తాను కూడా. - శిరీష చల్లపల్లి