
యాంకర్ రవి హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ఇది మా ప్రేమకథ’. ‘శశిరేఖా పరిణయం’ సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయిక. అయోధ్య కార్తీక్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పి.ఎల్.కె. రెడ్డి, దినేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేఘన లోకేష్ పంచుకున్న చిత్ర విశేషాలు...
► ‘ఇది మా ప్రేమకథ’ నా తొలి సినిమా. ‘శశిరేఖా పరిణయం’ సీరియల్ చూసి కార్తీక్‌గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన కథ చెప్పినప్పుడు ప్లెయిన్‌గా అనిపించింది. కానీ, నేను చేస్తేనే బాగుంటుందంటూ ఆయన కన్విన్స్ చేయడంతో చేశా.
► ఇదొక లవ్ స్టోరీ. ప్రేమించుకోవడానికి సరైన వయసు ఏది? ప్రేమికులు ఎందుకు విడిపోతున్నారు? ఓ సమస్యను లవర్స్ ఇద్దరూ ఎందుకు వేర్వేరుగా చూస్తున్నారు? ఇద్దరూ ఒకేలా చూస్తే సమస్య ఉండదు కదా? అని చూపించారు. నా పాత్ర పేరు సంధ్య. చాలా నార్మల్‌గా ఉంటుంది. చిన్న బడ్జెట్లో చక్కగా తీశారు. మూవీ సింపుల్‌గా, సహజంగా ఉంటుంది.
► సీరియల్స్, సినిమాలు ఎంజాయ్ చేస్తున్నా. రెండిట్లోనూ కష్టాలు, సుఖాలు ఉన్నాయి. నేను సీరియల్స్ నుంచే వచ్చాను కాబట్టి ఎప్పటికీ వాటిని మర్చిపోను. హీరోయిన్ అయినా మంచి కథలు వస్తే తప్పకుండా సీరియల్స్ చేస్తూనే ఉంటా.
► తెలుగులో హీరో నాగార్జునగారు, హీరోయిన్ సౌందర్యగారంటే ఇష్టం. నా మాతృ భాష కన్నడలో గతంలో ఒక సినిమా ఆఫర్ వచ్చింది. కంటిన్యూస్‌గా మూడు నెలలు డేట్స్ అడిగారు. అప్పుడు సీరియల్స్‌తో బిజీగా ఉండటంతో చేయలేదు. ఇప్పుడు చాన్స్ వచ్చే చేస్తా.
Comments
Please login to add a commentAdd a comment