జీవితాలు ఖరాబ్‌.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్‌ రవి | Anchor Ravi Says He Forgot His Daughter's Face | Sakshi
Sakshi News home page

Anchor Ravi: తల దించుకున్నా, అందుకే పెళ్లి విషయం దాచా!

May 9 2024 4:38 PM | Updated on May 9 2024 5:45 PM

Anchor Ravi Says He Forgot His Daughter's Face

కో యాంకర్‌తో ముడిపెట్టేవారు. ఆమె భర్తను పట్టుకుని నీ భర్త అంటావేంటి? అని నిత్యనే నిలదీశారు. పాపం..

యాంకర్‌ రవి.. ఒకప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ ఉండేవాడు. గతంలో అతడు యాంకర్‌ లాస్యతో జోడీగా షోలు చేయడంతో జనాలు వీరిద్దరినీ జంటగా ఊహించుకునేవారు. ఎంతో క్రేజ్‌ ఉన్న ఈ జంట మధ్య సడన్‌గా ఏదో గొడవలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారు, కలిసి షోలు చేయడం కూడా ఆపేశారు. 

నిత్యతో పెళ్లి
తర్వాత ఎన్నో ఏండ్లకు కలిసిపోయారు. కానీ అప్పటికే ఇద్దరూ చెరో దారి చూసుకున్నారు. లాస్య.. మంజునాథ్‌ను పెళ్లి చేసుకోగా యాంకర్‌ రవి.. నిత్య మెడలో తాళి కట్టాడు. తమకు పెళ్లైన విషయాలను ఇద్దరూ ఆలస్యంగానే బయటపెట్టారు. తాజాగా ఓ షోకి హాజరైన రవి తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్‌ అయ్యాడు. 

డబ్బు కోసమే పని
'నేను పక్కా కమర్షియల్‌.. నేను డబ్బు కోసమే పని చేస్తున్నాను. నేనసలు కొరియోగ్రాఫర్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కొంతమంది హీరోల దగ్గరికి వెళ్లి నా ఆసక్తిని బయటపెట్టాను. నాగార్జున గారు ముందు పని నేర్చుకుని తర్వాత ప్రయత్నించమన్నారు. ఓ ఛానల్‌లో కూడా పెట్టించాడు. అక్కడ సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనే షో చేశాను. అలా నా జర్నీ మొదలైంది.

కో యాంకర్‌తో కనెక్షన్‌
నాకు పెళ్లయిందన్న విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదంటే.. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు అక్కడున్నవారు నిత్యతో.. నన్ను చూపిస్తూ ఫలానా తెలుగు యాంకర్‌ హజ్బెండ్‌ కదా అనేవారు. నన్ను నా కో యాంకర్‌తో ముడిపెట్టేవారు. కాదని చెప్తే.. ఆమె భర్తను పట్టుకుని నీ భర్త అంటావేంటి? అని నిత్యనే నిలదీశారు. పాపం.. తను ఎలా ఫీలవుతుందోనని నేను తల దించుకునేవాడిని. అందుకే తనను లేటుగా పరిచయం చేశాను.

నా కూతుర్ని మర్చిపోయా
బిగ్‌బాస్‌ షో విషయానికి వస్తే.. ఈ రియాలిటీ షో వల్ల చాలామంది జీవితాలు ఖరాబయ్యాయి. అక్కడ జరిగేవాటిని జడ్జ్‌ చేయొద్దు. నేను బిగ్‌బాస్‌కు వెళ్లిన 15 రోజులకు నా కూతురి ముఖం ఎలా ఉంటుందో మర్చిపోయాను. తనెలా ఉంటుందో గుర్తురాలేదు.. బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగేదంతా మీకు చూపించరు' అని రవి చెప్పుకొచ్చాడు.

చదవండి: 'చివరి స్టేజీలో ఉన్నా.. నా భర్త ముఖం మాడిపోయింది'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement