తేజస్‌ ముగింపు పార్టీలో కంగనా.. గోల్డెన్‌ గౌనులో తళుక్కుమందిగా | Kangana Ranaut Wears Golden Gown in Tejas Wrap Up Bash | Sakshi
Sakshi News home page

తేజస్‌ ముగింపు పార్టీలో కంగనా.. గోల్డెన్‌ గౌనులో తళుక్కుమందిగా.. ఫోటోలు వైరల్‌

Published Sat, Nov 13 2021 11:57 AM | Last Updated on Sat, Nov 13 2021 12:53 PM

Kangana Ranaut Wears Golden Gown in Tejas Wrap Up Bash - Sakshi

బాలీవుడ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలకు నిలయంగా మారింది కంగనా రనౌత్‌(Kangana Ranaut ). తాజాగా 1947లో వచ్చిన భారతదేశ స్వాతంత్యం ఓ భిక్షగా అభివర్ణించి పెద్ద దుమారాన‍్నే రేపింది. ఇదిలా ఉండగా కంగనా రాబోయే చిత్రం 'తేజస్‌' ముగింపు పార్టీలో తన అందచందాలతో కనువిందు  చేసిందీ క్వీన్‌. ఈ పార్టీలో గాల్వన్‌ లండన్‌ గోల్డెన్ ఈవెనింగ్‌ గౌన్‌లో కంగనా తళుక‍్కుమంటు మెరిసింది. మినిమిలిస్టిక్‌ మేకప్‌ వేసుకుని తన సహజమైన కర్ల‍్స్‌ హేయిర్‌తో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సెలబ్రిటీల ఫొటోగ్రాఫర్‌ వైరల్‌ భయాని షేర్ చేశాడు. 


'తేజస్'లో కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ 'తేజస్ గిల్' పాత్రలో కనిపించనుంది. సర్వేష్ మేవారా ఈ చిత్రానికి రచన, దర్శకత్వం చేశారు. 2016లో భారత వైమానిక దళం మహిళలను పోరాటల్లోకి ప్రవేశపెట్టిన దేశ రక్షణ దళాలలో మొదటిది. ఈ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తీసిన చిత్రమే తేజస్‌. కంగనా చేతిలో 'మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిద్దా', 'ఎమర్జెన్సీ', 'ది ఇంకర్నేషన్‌: సీత' వంటి ఇతర ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement