యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా.. ‘తేజస్‌’ వచ్చేస్తుంది! | kangana Ranaut Tejas Movie To Release Date Ott | Sakshi
Sakshi News home page

యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా.. ‘తేజస్‌’ వచ్చేస్తుంది!

Published Sun, Oct 1 2023 11:44 AM | Last Updated on Sun, Oct 1 2023 11:53 AM

kangana Ranaut Tejas Movie To Release Date Ott - Sakshi

వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కంగనా రనౌత్‌. 2006లో బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ..వరుస సినిమాతో తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగింది. ఫీమేల్‌ సెంట్రిక్‌ సినిమాలతో స్టార్‌ హీరోలకు సైతం పోటీ ఇచ్చే రేంజ్‌కి ఎదిగింది. బాలీవుడ్‌ పెద్దలను ఎదురించి ఫైర్‌ బ్రాండ్‌గా మారింది. అందరి హీరోయిన్లలా కమర్షియల్‌గా కాకుండా.. తన  పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ చిత్రాన్ని అంగీకరిస్తుంది.

ఇటీవల ఈ బ్యూటీ నటించిన చంద్రముఖి 2 విడుదలైంది. త్వరలోనే మరో ఫీమేల్‌ సెంట్రిక్‌ మూవీ ‘తేజస్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఇందులో యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా కనిపించనుంది. అక్టోబర్‌ 20న  ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ని షూరూ చేసేందుకు చిత్ర యూనిట్‌ రెడీ అవుతోంది.

ఇందులో భాగంగా అక్టోబర్‌ 2న ఈ మూవీ టీజర్‌ని విడుదల చేయాలని టీమ్‌ భావిస్తోందట. 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సర్వేష్‌ మేవారా దర్శకత్వం వహిస్తు​న్న ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement