
తేజస్, కరిష్మా కర్పాల్, సీమా పర్మార్ హీరో హీరోయిన్లుగా ఎం.వి. ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మనసా.. వాచా’. నిశ్చల్ దేవా–లండన్ గణేష్ నిర్మించిన ఈ సినిమా ఎం.జి.ఎం (మినిమమ్ గ్యారంటీ మూవీస్) ద్వారా ఈ నెల 15న విడుదలవుతోంది. ఎం.వి.ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘జ్వరం, జలుబు వంటి వ్యాధులు వచ్చినప్పుడు మందులు వేసుకుని నయం చేసుకుంటాం. క్యాన్సర్ సోకినప్పుడు కూడా అంతే సులభంగా నయం చేసుకునేలా ఉండాలనే లక్ష్యంతో పని చేసే ప్రేమికులకు ఎదురయ్యే కొన్ని అనూహ్య సంఘటనలతో తెరకెక్కిన చిత్రమిది.
ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల్లో సగం క్యాన్సర్ వ్యాధికి ఉచితంగా వైద్యం అందించే సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాం’’ అన్నారు. ‘లైఫ్ స్టైల్, తులసిదళం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన నేను ‘మనసా.. వాచా’ కథ నచ్చడంతో నిర్మాతగా మారాను. ఎం.వి. ప్రసాద్ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు’’ అన్నారు నిశ్చల్ దేవా. ‘‘ఇంత మంచి సినిమా మా ఎం.జి.ఎం ద్వారా రిలీజవ్వడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎం.జి.ఎం అధినేత అచ్చిబాబు.
Comments
Please login to add a commentAdd a comment