Karisma
-
సగం విరాళానికి...
తేజస్, కరిష్మా కర్పాల్, సీమా పర్మార్ హీరో హీరోయిన్లుగా ఎం.వి. ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మనసా.. వాచా’. నిశ్చల్ దేవా–లండన్ గణేష్ నిర్మించిన ఈ సినిమా ఎం.జి.ఎం (మినిమమ్ గ్యారంటీ మూవీస్) ద్వారా ఈ నెల 15న విడుదలవుతోంది. ఎం.వి.ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘జ్వరం, జలుబు వంటి వ్యాధులు వచ్చినప్పుడు మందులు వేసుకుని నయం చేసుకుంటాం. క్యాన్సర్ సోకినప్పుడు కూడా అంతే సులభంగా నయం చేసుకునేలా ఉండాలనే లక్ష్యంతో పని చేసే ప్రేమికులకు ఎదురయ్యే కొన్ని అనూహ్య సంఘటనలతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల్లో సగం క్యాన్సర్ వ్యాధికి ఉచితంగా వైద్యం అందించే సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాం’’ అన్నారు. ‘లైఫ్ స్టైల్, తులసిదళం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన నేను ‘మనసా.. వాచా’ కథ నచ్చడంతో నిర్మాతగా మారాను. ఎం.వి. ప్రసాద్ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు’’ అన్నారు నిశ్చల్ దేవా. ‘‘ఇంత మంచి సినిమా మా ఎం.జి.ఎం ద్వారా రిలీజవ్వడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎం.జి.ఎం అధినేత అచ్చిబాబు. -
ఏడుపు ఆపడం లేదని కోపంతో కొట్టింది..
తిరుపతి: ఓ తల్లి క్షణికావేశం తన 8 నెలల కొడుకు మృతికి కారణమైంది. మంచంపై నుంచి కిందపడ్డ చిన్నారి నొప్పితో ఎంతకీ ఏడుపు ఆపడం లేదని కోపంతో తల్లి కొట్టింది. దీంతో చిన్నారి అక్కడిక్కడే చనిపోయాడు. తిరుపతికి చెందిన మోహన్‌కుమార్, కరిష్మాలకు ఏడాదిన్నర కిందట వివాహం అయింది. వీరికి ప్రభాస్(8 నెలల) కుమారుడు ఉన్నాడు. సోమవారం ఉదయం చిన్నారి ప్రభాస్ మంచంపై నుంచి కింద పడడంతో బాధ తట్టుకోలేక ఏడుస్తూనే ఉన్నాడు. ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో కరిష్మా అసహనంతో కొడుకుని చెంపపై బలంగా కొట్టింది. దీంతో నోరు, చెవిలో నుంచి రక్తం కారి చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు. తన బిడ్డను భార్యే కొట్టి చంపిందని బిడ్డ తండ్రి మోహన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్షణికావేశంలో బిడ్డను కొట్టానని, చంపాలని అనుకోలేదని కన్నతల్లి కరిష్మా పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరైంది. కరిష్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. -
లవర్ శాక్రిఫైస్!
ఇదో రకం గోల! రియాల్టీ షోను రియల్ లైఫ్‌గా మార్చేస్తున్న జాతర! విషయమేమంటే... బిగ్‌బాస్ హౌస్‌లో హాట్ టాపిక్ ఉపెన్, కరిష్మాల సాన్నిహిత్యం. ఇద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేకపోతున్నారు. హౌస్‌లో కెమెరా కన్ను పడని చోట... లిప్‌లాక్‌లతో మైమరచిపోతున్నారు. ఇది చూసిన కరిష్మా బాయ్‌ఫ్రెండ్ రుషబ్ చోక్సీ హర్టయినట్టున్నాడు. ‘నువ్వు నాకు నచ్చలేదు’ అంటూ తన ప్రేయసికి చెప్పేశాడు. వరుస ట్వీట్స్‌తో ఉపెన్- కరిష్మాల రొమాంటిక్ టచ్ గురించి ప్రస్తావించిన రుషబ్... తన బాధను చెప్పకనే చెప్పాడు. చివరకు... ‘ఉపెన్ ఇక కరిష్మా నీదే. నేను మరో మంచి గాళ్‌ఫ్రెండ్‌ను వెతుక్కుంటా’ అని ముగించాడు చిలిపిగా! -
‘బిగ్’ లాక్!
రియాల్టీ షో బిగ్ బాస్‌లో వలపుల పంట పండుతోంది. రొమాన్స్‌ల రచ్చ తారస్థాయికి చేరుతోంది. ఒకరికి మించి ఒకరు... ‘షో’లో ‘రియల్’గా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఉపెన్, కరిష్మాల వంతు. ఇద్దరి సాన్నిహిత్యం గురించి చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ లేదు గానీ... ఈ మధ్య అది మరీ ముదిరిపోయింది. కాస్త సైడైతే చాలు... లిప్‌లాక్‌లతో చెలరేగిపోతున్నారు. హౌస్‌లో ఉన్నవారంతా నిద్దర పోతుండగా... అధరామృతాన్ని ఆస్వాదించేశారు. కాసేపటికి ‘కెమెరా కన్ను’ ఉందని రియలైజ్ అయిన కరిష్మా... బయట తనకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకొచ్చింది. ముందు అతని వ్యవహారం సెటిల్ చేసి ఇతగాడికి గురించి ఆలోచిస్తానంటోంది!