ఆత్మ నిర్భర భారత్ దిశ గా భారత్ సొంతంగా రూపొందించిన యుద్ద నౌక విక్రాంత్. ఐఎన్ ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకా పై తొలి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ను దింపింది నేవీ సిబ్బంది. తద్వారా భారత రక్షణ రంగంలో నవశకానికి నాంది పలికింది.
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: రక్షణ రంగంలో పాటవ ప్రదర్శనలో భారత నౌకాదళం మరో కీలక అడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఈ ప్రదర్శనకు వేదికగా మారింది. భారత సముద్రజలాల్లో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా లైట్ కాంబోట్ ఎయిర్‌క్రాఫ్ట్స్(ఎల్‌సీఏ)ని నేవీ పైలట్లు సోమవారం వేర్వేరు ట్రయల్స్‌లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌పై స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వడం శుభపరిణామమని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు అభినందనలు తెలిపాయి.
ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది అతివేగంగా శత్రు లక్ష్యాలపై దాడి చేసే ఈ ఐ ఎన్ ఎస్ విక్రాంత్ యుద్ధనౌక పై అతి వేగంగా ప్రయాణించే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే సదుపాయం ఉంది. ఈ ప్రక్రియ సోమవారం విజయవంతంగా ముగిసింది. ఇప్పటివరకు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధనౌకలపై విమానాలు దిగే సాంకేతిక పరిజ్ఞానం భారత్ వినియోగిస్తుంది. ఇప్పుడు భారతదేశ తొలిసారిగా విమాన వాహక యుద్ధనౌకను సిద్ధం చేసుకోవడంపై భారతీయులు గర్వపడుతున్నారు.
విక్రాంత్‌పై మిగ్–29కే రయ్..రయ్
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ షిప్ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా మిగ్–29కే యుద్ధ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దీనికి సంబంధించిన పరీక్షల్ని సముద్ర జలాల్లో సోమవారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించినట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.
2.5 సెకన్లలో 240 నుండి 0 కి.మీ
సముద్ర ట్రయల్స్‌లో భాగంగా స్వదేశీ యుద్ధ విమానం తేజస్.. విజయవంతంగా బయలుదేరి విమాన వాహక నౌక ఫ్లైట్ డెక్‌పై ల్యాండ్ అయింది. ఈ నేవల్ వేరియెంట్ జెట్ మిషన్‌కి నేతృత్వం వహించారు కామ్రేడ్ జైదీప్ మావోలంకర్(రిటైర్డ్). చిన్న నౌక మీద ల్యాండ్ కావడం అంటే చాలా కష్టతరమైన వ్యవహారం. కేవలం 2.5 సెకండ్లలోనే గంటకు 240 కిలోమీటర్ల నుంచి సున్నాకు జెట్‌ను అదుపు చేయడం పైలట్లకు ఛాలెంజ్‌తో కూడిన వ్యవహారం. ఆ టైంలో ల్యాండింగ్‌పై నియంత్రణ కూడా కష్టమేనని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఐఎన్‌ఎస్ విక్రాంత్.. భారత నౌకాదళం కోసం కేరళలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) నిర్మించిన విమాన వాహక నౌక. 45,000 టన్నుల బరువున్న ఈ నౌకను.. ₹ 20,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇది రంగ ప్రవేశం చేసింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌తో యుద్ధ విమానాల అనుసంధానం 2023 మే లేదంటే జూన్ నాటికి పూర్తవుతుందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ గతంలో వెల్లడించారు. మరో విశేషం ఏంటంటే.. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యా డెక్ మీద తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ప్రొటోటైప్‌ను కామ్రేడ్ మావోలంకర్ స్వయంగా ల్యాండ్ చేయడం గమనార్హం. తద్వారా అలాంటి ఘనత సాధించిన కొద్ది దేశాల సరసన భారత్ నిలిచినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment