minister padmarao
-
మంత్రి పద్మారావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ. పద్మారావు, టీఆర్ఎస్ నేతలపై గతంలో నమోదైన కేసులను నాంపల్లి కోర్టు బుధవారం కొట్టివేసింది. పద్మారావుతోపాటు సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సమయంలో కేసులు దాఖలయ్యాయి. 2014 ఎన్నికల్లో సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ.. పద్మారావు, ఆయన అనుచరులపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణ సందర్భంగా మంత్రి పద్మారావు, ఆయన అనుచరులు బుధవారం నాంపల్లిలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు. కేసు పూర్వపరాలను విచారించిన జిల్లా మెట్రోపాలిటన్ న్యాయస్థానం ఈ కేసులను కొట్టివేసింది. టీఆర్ఎస్ నేతల తరఫున న్యాయవాది సంతోష్ రెడ్డి కోర్టులో తమ వాదనలను వినిపించారు. -
అమెరికా కష్టాలు
తేజస్, వంశీ కోడూరి, వైవా హర్ష, వంశీకృష్ణ, పల్లవి డోరా తారలుగా చల్లా భానుకిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమీర్‌పేట్ టు అమెరికా’. స్వప్న కొమండూరి సమర్పణలో పద్మజ కొమండూరి నిర్మించారు. కార్తీక్ కొడకండ్ల స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తెలంగాణ ఎక్సైజ్ మంత్రి పద్మారావు విడుదల చేయగా, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్వీకరించారు. మంత్రి పద్మారావు మాట్లాడుతూ– ‘‘ఇక్కడ కుటుంబాలను వదులుకొని చదువు కోసం, సంపాదన కోసం అమెరికా వెళ్లి అక్కడ సరైన అవకాశాల్లేక నానా ఇబ్బందులుపడే చాలామంది బాధలను ఈ చిత్రం ద్వారా చూపించడం అభినందనీయం’’ అన్నారు. ‘‘సినిమాని ఆదరించి హిట్ చేస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత రామ్. ‘‘ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు రామ్మోహన్ కొమండూరి. -
మంత్రి పద్మారావుకు ఆస్ట్రేలియాలో ఘనస్వాగతం
మెల్బోర్న్: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వచ్చిన తెలంగాణ క్రీడాశాఖ మంత్రి పద్మారావుకు అక్కడి టీఆర్ఎస్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ నెల 4 నుంచి 15వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వచ్చిన క్రీడామంత్రి పద్మారావు, శాప్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సెక్రటరీ బూర వెంకటేశం, ఇతర అధికారులకు మెల్బోర్న్ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా టీఆర్ఎస్ శాఖ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, టీఆర్ఎస్ విక్టోరియా రాష్ట్ర ఇన్చార్జి సాయిరాం ఉప్పు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ మనదేశం తరఫున కామన్వెల్త్ క్రీడల్లో 221 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా, అందులో 12 మంది తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్ర క్రీడాకారులు కామన్వెల్త్ గేమ్స్‌లో పథకాలు సాధించి, మనదేశం, రాష్ట్రం ప్రతిష్టను పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులు సాయిప్రసాద్ యాదవ్, ఉదయ్సింహరెడ్డి, రామ్‌ప్రసాద్ యాదవ్, ఏల్లూరు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కోచ్‌లను పంపేందుకు అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన వర్ధమాన జిమ్నాస్ట్‌లు బుద్ధా అరుణా రెడ్డి, మేఘనా రెడ్డిల వెంట వ్యక్తిగత కోచ్‌లను కామన్వెల్త్ క్రీడలకు అనుమతించాలని పేర్కొంటూ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు లేఖ రాశారు. ఏప్రిల్ 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు జిమ్నాస్టిక్స్‌లో పతకం అందించే అత్యుత్తమ ప్రతిభ ఈ ఇద్దరిలోనూ ఉందని ఆయన పేర్కొన్నా. ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో బుద్ధా అరుణారెడ్డి కాంస్య పతకం సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సరైన సమయంలో వారికి మార్గదర్శకాలు ఇచ్చే వ్యక్తుల అవసరం ఉందని, వారివెంట వ్యక్తిగత కోచ్‌లను పంపించేందుకు అనుమతించాలని లేఖలో కోరారు. వారి శిక్షకులు కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లేందుకు కావాల్సిన అక్రెడిటేషన్ కార్డులను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)చేత ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కోచ్‌ల ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించుకుంటుందని వివరించారు. -
గీత కార్మికులకు డబుల్బెడ్రూం ఇళ్లు
ఎక్సైజ్ శాఖ మంత్రి కత్తి పద్మారావు ఈ ఏడాది 55 లక్షల ఈత, తాటి మొక్కలు నాటుతాం ఒక్కరోజే 12 లక్షల మొక్కల నాటాం జగిత్యాల రూరల్(సారంగాపూర్)/మెట్‌పల్లిరూరల్ : తెలంగాణ రాష్ట్రంలోని పేద గీత కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించారని ఎక్సైజ్ శాఖ మంత్రి కత్తి పద్మారావు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్ మండలం కోనాపూర్, మెట్పల్లి మండలం విట్టంపేట, మెట్లచిట్లాపూర్, వెల్లుల్ల గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ, గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. అనంతరమ మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో 55 లక్షల ఈత, తాటి మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. శనివారం ఒక్కరోజే 137 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 12 లక్షల మొక్కలు నాటామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది రెండు కోట్లు, ఆ తర్వాత ఏడాది 2.5 కోట్ల మొక్కలు నాటుతామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్సైజ్ కానిస్టేబుల్ నుంచి డెప్యూటీ కమిషనర్ వరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.30 కోట్ల పరిహారం పంపిణీ చేశామని తెలిపారు. గతంలో గీతా కార్మికులు చెట్లపై నుంచి పడి మృతి చెందితే రూ.2 లక్షల పరిహారం ఇచ్చారని, ఇప్పుడు దానిని రూ. 5 లక్షలకు పెంచాలని నిర్ణయించామని, త్వరలో జీవో జారీ చేస్తామన్నారు. ప్రతీ గీత కార్మిక కుటుంబం 15 ఈత, తాటి మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. గీత కార్మికులు సొసైటీ ద్వారా ఈత, తాటిచెట్లు పెంచుకుంటే వాటికి నీటి సౌకర్యం కల్పించేందుకు బోరుమోటరు ప్రభుత్వం నుంచి అందజేస్తామన్నారు. ఐదెకరాల పైబడి ఉన్న సొసైటీలకు మరిన్ని బోరుమోటర్లు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. ఈత, తాటిచెట్లు రోగాలతో ఎండిపోకుండా అగ్రికల్చర్ శాస్త్రవేత్తలతో పరిశోధన చేయించి నివారణ చర్యలు చేపడతామని తెలిపారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను గత ప్రభుత్వం 2004 సంవత్సరంలో మూసివేయించిందని, కల్లు దుకాణాలను తిరిగి తెరిపించిన ఘనత మాదేనన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.వెయ్యి పెన్షన్ మంజూర చేయించే బాధ్యత తమదే అన్నారు. టీసీఎస్(తాడి టాపర్స్ కో ఆపరేటివ్ సొసైటీ), టీస్సీ( ట్రూ ఫర్ క్రాపర్స్)ను గుర్తించి కార్మికులకు సహాయ సహకారాలు అందేలా చూస్తామన్నారు. అనంతరం నాటిన ఈత, తాటి మొక్కలను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమాల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జెడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి సంజయ్‌కుమార్, జగిత్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్, ఎక్సైజ్, పోలీస్ సీఐలు చంద్రశేఖర్, వాసం సురేంధర్, ఎస్సైలు చిరంజీవి, రాములు, సరిత, జెడ్పీటీసీ మారు విమలసాయిరెడ్డి, ఎంపీపీలు కొల్ముల శారద, గురిజెల రాజురాజరెడ్డి, సర్పంచులు తోడేటి శేఖర్‌గౌడ్, లక్ష్మి, సింగిరెడ్డి రాజేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు బద్దం శేఖర్‌రెడ్డి, ఏగోళపు భూమేశ్వర్, లక్ష్మీరాజం, జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ జాయింట్ సెక్రెటరీ రాజేశ్పెద్దన్నగౌడ్, మాజీ మంత్రి రాజేశంగౌడ్, మెట్పల్లి, కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్లు మర్రి ఉమారాణి, శీలం వేణుగోపాల్నాయకులు పాల్గొన్నారు. జగిత్యాలలో ఎక్సైజ్ స్టేషన్ తనిఖీ జగిత్యాల ఎక్సైజ్ కార్యాలయాన్ని మంత్రి పద్మారావు తనిఖీ చేశారు. సొంత భవనం అయినా ఎస్సారెస్పీ వారు కేటాయించింది కావడంతో ప్రస్తుతం జిల్లా కేంద్రం అవుతున్నందున ఇక్కడే కలెక్టరెట్ నిర్మించే అవకాశం ఉన్నట్లు కార్యాలయం అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సబ్‌కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, గౌడ కులస్తులకే ఈత, తాటివనాలను నర్సరీలను అప్పగిస్తే బాగుంటుందని, లేదంటే ట్రాన్స్‌పోర్టు ఖర్చులు అధికంగా అవుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈత, తాటిచెట్ల నర్సరీలను గౌడ కులస్తులకు అప్పగించాలని మంత్రి సైతం పేర్కొన్నారు.