సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన వర్ధమాన జిమ్నాస్ట్‌లు బుద్ధా అరుణా రెడ్డి, మేఘనా రెడ్డిల వెంట వ్యక్తిగత కోచ్‌లను కామన్వెల్త్ క్రీడలకు అనుమతించాలని పేర్కొంటూ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు లేఖ రాశారు. ఏప్రిల్ 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు జిమ్నాస్టిక్స్‌లో పతకం అందించే అత్యుత్తమ ప్రతిభ ఈ ఇద్దరిలోనూ ఉందని ఆయన పేర్కొన్నా.
ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో బుద్ధా అరుణారెడ్డి కాంస్య పతకం సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సరైన సమయంలో వారికి మార్గదర్శకాలు ఇచ్చే వ్యక్తుల అవసరం ఉందని, వారివెంట వ్యక్తిగత కోచ్‌లను పంపించేందుకు అనుమతించాలని లేఖలో కోరారు. వారి శిక్షకులు కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లేందుకు కావాల్సిన అక్రెడిటేషన్ కార్డులను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)చేత ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కోచ్‌ల ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించుకుంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment