గీత కార్మికులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు | geeta karmikulaku double Houses | Sakshi
Sakshi News home page

గీత కార్మికులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు

Published Sat, Jul 23 2016 10:30 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

కోనాపూర్‌లో గీత కార్మికుల మోకుతో మంత్రి పద్మారావు - Sakshi

కోనాపూర్‌లో గీత కార్మికుల మోకుతో మంత్రి పద్మారావు

  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి కత్తి పద్మారావు 
  • ఈ ఏడాది 55 లక్షల ఈత, తాటి మొక్కలు నాటుతాం 
  • ఒక్కరోజే 12 లక్షల మొక్కల నాటాం 
  • జగిత్యాల రూరల్‌(సారంగాపూర్‌)/మెట్‌పల్లిరూరల్‌ : తెలంగాణ రాష్ట్రంలోని పేద గీత కార్మికులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కత్తి పద్మారావు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్‌ మండలం కోనాపూర్, మెట్‌పల్లి మండలం విట్టంపేట, మెట్లచిట్లాపూర్, వెల్లుల్ల గ్రామాల్లో ఎక్సైజ్‌ శాఖ, గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. అనంతరమ మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో 55 లక్షల ఈత, తాటి మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. శనివారం ఒక్కరోజే 137 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో 12 లక్షల మొక్కలు నాటామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది రెండు కోట్లు, ఆ తర్వాత ఏడాది 2.5 కోట్ల మొక్కలు నాటుతామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్సైజ్‌ కానిస్టేబుల్‌ నుంచి డెప్యూటీ కమిషనర్‌ వరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.30 కోట్ల పరిహారం పంపిణీ చేశామని తెలిపారు. గతంలో గీతా కార్మికులు చెట్లపై నుంచి పడి మృతి చెందితే రూ.2 లక్షల పరిహారం ఇచ్చారని, ఇప్పుడు దానిని రూ. 5 లక్షలకు పెంచాలని నిర్ణయించామని, త్వరలో జీవో జారీ చేస్తామన్నారు. ప్రతీ గీత కార్మిక కుటుంబం 15 ఈత, తాటి మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. గీత కార్మికులు సొసైటీ ద్వారా ఈత, తాటిచెట్లు పెంచుకుంటే వాటికి నీటి సౌకర్యం కల్పించేందుకు బోరుమోటరు ప్రభుత్వం నుంచి అందజేస్తామన్నారు. ఐదెకరాల పైబడి ఉన్న సొసైటీలకు మరిన్ని బోరుమోటర్లు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. ఈత, తాటిచెట్లు రోగాలతో ఎండిపోకుండా అగ్రికల్చర్‌ శాస్త్రవేత్తలతో పరిశోధన చేయించి నివారణ చర్యలు చేపడతామని తెలిపారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను గత ప్రభుత్వం 2004 సంవత్సరంలో మూసివేయించిందని, కల్లు దుకాణాలను తిరిగి తెరిపించిన ఘనత మాదేనన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.వెయ్యి పెన్షన్‌ మంజూర చేయించే బాధ్యత తమదే అన్నారు. టీసీఎస్‌(తాడి టాపర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ), టీస్‌సీ( ట్రూ ఫర్‌ క్రాపర్స్‌)ను గుర్తించి కార్మికులకు సహాయ సహకారాలు అందేలా చూస్తామన్నారు. అనంతరం నాటిన ఈత, తాటి మొక్కలను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమాల్లో  కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జెడ్పీచైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్‌ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్, జగిత్యాల ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ విజయ్, ఎక్సైజ్, పోలీస్‌ సీఐలు చంద్రశేఖర్, వాసం సురేంధర్, ఎస్సైలు చిరంజీవి, రాములు, సరిత, జెడ్పీటీసీ మారు విమలసాయిరెడ్డి, ఎంపీపీలు కొల్ముల శారద, గురిజెల రాజురాజరెడ్డి, సర్పంచులు తోడేటి శేఖర్‌గౌడ్, లక్ష్మి, సింగిరెడ్డి రాజేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు బద్దం శేఖర్‌రెడ్డి, ఏగోళపు భూమేశ్వర్, లక్ష్మీరాజం, జీహెచ్‌ఎంసీ టీఆర్‌ఎస్‌ జాయింట్‌ సెక్రెటరీ రాజేశ్‌పెద్దన్నగౌడ్, మాజీ మంత్రి రాజేశంగౌడ్, మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్లు మర్రి ఉమారాణి, శీలం వేణుగోపాల్‌నాయకులు పాల్గొన్నారు.
     జగిత్యాలలో ఎక్సైజ్‌ స్టేషన్‌ తనిఖీ 
    జగిత్యాల ఎక్సైజ్‌ కార్యాలయాన్ని మంత్రి పద్మారావు తనిఖీ చేశారు. సొంత భవనం అయినా ఎస్సారెస్పీ వారు కేటాయించింది కావడంతో ప్రస్తుతం జిల్లా కేంద్రం అవుతున్నందున ఇక్కడే కలెక్టరెట్‌ నిర్మించే అవకాశం ఉన్నట్లు కార్యాలయం అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సబ్‌కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ, గౌడ కులస్తులకే ఈత, తాటివనాలను నర్సరీలను అప్పగిస్తే బాగుంటుందని, లేదంటే ట్రాన్స్‌పోర్టు ఖర్చులు అధికంగా అవుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈత, తాటిచెట్ల నర్సరీలను గౌడ కులస్తులకు అప్పగించాలని మంత్రి సైతం పేర్కొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement