శాన్వీ మేఘన, విజయ్ దేవరకొండ, ఆనంద్, గీత్ సైనీ, దామోదర
‘‘పుష్పకవిమానం’ సినిమాకు నిర్మాతను నేను. ఈ సినిమాపై కొందరి కెరీర్స్ ఆధారపడి ఉన్నాయి. ఒక్కోసారి నిర్మాణం అవసరమా? అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఒక్కొక్కరూ తమకు దక్కిన అవకాశాల గురించి మాట్లాడుతుంటే.. ఇలాంటి ఎమోషన్‌తోనే కదా మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసిందని గుర్తొచ్చి, కష్టమైనా చేయాలనిపిస్తుంది. నన్ను రెండే నడిపిస్తున్నాయి. అనుకున్నది సాధించగలనన్న నా ఆత్మవిశ్వాసం. రెండోది నా ఓవర్ కాన్ఫిడెన్స్. అది మీ (అభిమానులు, ప్రేక్షకులు) మీద ఉన్న కాన్ఫిడెన్స్’’ అన్నారు విజయ్ దేవరకొండ.
ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా దామోదర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్ధనరావు, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘సృజన్ (చిత్రదర్శకుడు దామోదర) మంచి రైటర్, డైరెక్టర్. ఈ సినిమాకు మరో పిల్లర్ ఆనంద్. నటన చింపేశాడు.’’ అన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్ర చేశాను. వైవాహిక జీవితం గురించి ఎన్నో ఊహించుకున్న చిట్టిలంక సుందర్ భార్య వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నదే కథ’’ అన్నారు.
‘‘చాలామందిని సపోర్ట్ చేయడానికి విజయ్ ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు విజయ్ మిట్టపల్లి. ‘‘ఆనంద్ నటనతో పాటు ఈ సినిమాలోని కామెడీ, థ్రిల్లింగ్ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అన్నారు దామోదర. నటుడు హర్షవర్థన్, మ్యూజిక్ డైరెక్టర్స్ మార్క్ కె రాబిన్, సిద్దార్థ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్‌ను మహిళలు డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతున్నాను . సమస్యలుంటే ఈ యాప్ ద్వారా పోలీసులను కాంటాక్ట్ కావొచ్చు. పోలీసులు రెస్పాండ్ అవుతారు. కానీ ఎవరికీ ఈ యాప్ అవసరం రాకూడదనే కోరుకుంటున్నాను .
Comments
Please login to add a commentAdd a comment