‘‘కార్తీగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని మన తెలుగు హీరో అని చెప్పుకుంటాం. ‘96’ సినిమాకి పెద్ద ఫ్యాన్‌ని. ప్రేమ్ కుమార్‌గారు నా కలల దర్శకుడు. వారిద్దరూ కలిసి చేసిన ‘సత్యం సుందరం’ సినిమాని ఈ 28న చూడండి. అలాగే 27న ‘దేవర’ చిత్రం చూడండి. ఈ రెండు సినిమాలూ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. కార్తీ, అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో శ్రీదివ్య కీలకపాత్రలో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది.
ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్ మెంట్స్ ఎల్‌ఎల్‌పీ తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌కి విశ్వక్ సేన్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘కొన్ని నెలల క్రితం కార్తీగారిని కలిసి, కథ చెప్పాను. ఆయన ఓకే చేయడమే మిగిలి ఉంది. ‘సత్యం సుందరం’ ట్రైలర్, టీజర్ చాలా నచ్చాయి. ఈ సినిమా చూడ్డానికి ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.
‘‘యుగానికి ఒక్కడు’ సినిమా చూసినప్పుడే కార్తీగారు నాకు చాలా నచ్చేశారు. నాకు ఇష్టమైన హీరోతో పని చేయడం హ్యాపీ. మా సినిమాని చూడండి’’ అని శ్రీదివ్య తెలిపారు. ‘‘ఆర్య, జగడం’ సినిమాలతో నా కెరీర్‌ని తెలుగులో ప్రారంభించాను. ఆ తర్వాత తమిళ పరిశ్రమకు వెళ్లాను. ఈ నెల 28న అందరం థియేటర్స్‌లో కలుద్దాం’’ అని పేర్కొన్నారు ప్రేమ్ కుమార్. ‘‘చాలా హార్ట్‌ఫుల్‌గా తీసిన సినిమా ‘సత్యం సుందరం’’ అని నిర్మాత సురేష్ బాబు చెప్పారు. రచయిత, నటుడు రాకేందు మౌళి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment