రెడీలా బ్లాక్‌ బస్టర్‌ కావాలి: శ్రీనువైట్ల | Director Srinu Vaitla extends his wishes to Dhoom Dhaam | Sakshi
Sakshi News home page

రెడీలా బ్లాక్‌ బస్టర్‌ కావాలి: శ్రీనువైట్ల

Published Wed, Nov 6 2024 12:26 AM | Last Updated on Wed, Nov 6 2024 12:26 AM

Director Srinu Vaitla extends his wishes to Dhoom Dhaam

‘‘ధూం ధాం’ సినిమా పాటలు బాగున్నాయి. ఈ చిత్రం ఫస్టాఫ్‌ ప్లెజంట్‌గా ఉండి సెకండాఫ్‌ హిలేరియస్‌గా ఉందని ఈ మూవీకి పని చేసిన నా స్నేహితులు చెప్పారు. మా ‘రెడీ’ సినిమాకి కూడా సెకండాఫ్‌ హిలేరియస్‌గా ఉందనే టాక్‌ విడుదలకి ముందే వచ్చింది. అదే తరహాలో రూపొందిన ’ధూం ధాం’ చిత్రం ‘రెడీ’లా బ్లాక్‌ బస్టర్‌ ఎంటర్‌టైనర్‌ కావాలి’’ అని డైరెక్టర్‌ శ్రీను వైట్ల ఆకాంక్షించారు. చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా సాయి కిషోర్‌ మచ్చా దర్శకత్వం వహించిన సినిమా ‘ధూం ధాం’. ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ‘ధూం ధాం’ ప్రీ రిలీజ్‌కి అతిథిగా హాజరైన దర్శకుడు వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ– ‘‘సాయికిషోర్‌ మచ్చ నాకు మంచి మిత్రుడు. ‘ధూం ధాం’తో తనకి, యూనిట్‌కి మంచి విజయం దక్కాలి’’అన్నారు. ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు సాయి రాజేశ్‌ అన్నారు. ‘‘మా అబ్బాయి చేతన్‌ను ఈ సినిమా హీరోగా మరో మెట్టు ఎక్కిస్తుంది’’ అన్నారు రామ్‌ కుమార్‌.

‘‘శ్రీను వైట్లగారి కామెడీని, వైవీఎస్‌ గారి సాంగ్స్‌ స్టైల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ చేశాను. ప్రేక్షకుల టికెట్‌ ధరకు సరిపడా నవ్వులు అందిస్తాం’’ అని సాయికిషోర్‌ మచ్చా తెలిపారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో గీత రచయితగా రెండు దశాబ్దాల ప్రయాణం పూర్తి చేసుకున్న రామజోగయ్య శాస్త్రిని ఈ వేదికపై సన్మానించారు.   నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దామోదర ప్రసాద్‌ మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement