ఓ ప్రేమకథ | prema janta audio launch | Sakshi
Sakshi News home page

ఓ ప్రేమకథ

Published Sat, Jun 22 2019 2:09 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

prema janta audio launch - Sakshi

సుమయ

రామ్‌ ప్రణీత్, సుమయ జంటగా నిఖిలేష్‌ తొగరి దర్శకత్వంలో మహేష్‌ మొగుళ్ళూరి నిర్మించిన చిత్రం ‘ప్రేమజంట’. స్క్రీన్‌ మ్యాక్స్‌ పిక్చర్స్‌ పతాకంపై దగ్గుబాటి వరుణ్‌ ఈ నెల 28న విడుదల చేస్తున్నారు.  ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో డైరెక్టర్‌ సాగర్, టి. ప్రసన్నకుమార్‌ ముఖ్య అతిథులుగా పాల్గొని,  ఆడియో సీడీలను విడుదల చేశారు. ‘‘నిర్మాత మహేశ్‌గారు పెట్టిన డబ్బు తిరిగి రావాలి’’అన్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ‘‘మా బ్యానర్‌లో ఈ సినిమా విడుదల కాబోతుండటం హ్యాపీగా ఉంది. కంటెంట్‌ తెలియగానే రిలీజ్‌ చేద్దామని డిసైడ్‌ అయ్యాం. మంచి సబ్జెక్ట్‌తో వస్తున్నాం’’ అన్నారు వరుణ్‌. ‘‘గ్రేస్‌ఫుల్‌ అబ్బాయిలు, బ్యూటిఫుల్‌ అమ్మాయిల ప్రేమే ఈ చిత్రం’’ అన్నారు మహేశ్‌. ‘‘దర్శకుడు కావాలనే నా 13 ఏళ్ల కల నెరవేరింది’’ అన్నారు దర్శకుడు నిఖిలేష్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement