Premajanta
-
ఓ ప్రేమకథ
రామ్ ప్రణీత్, సుమయ జంటగా నిఖిలేష్ తొగరి దర్శకత్వంలో మహేష్ మొగుళ్ళూరి నిర్మించిన చిత్రం ‘ప్రేమజంట’. స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్ పతాకంపై దగ్గుబాటి వరుణ్ ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో డైరెక్టర్ సాగర్, టి. ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని, ఆడియో సీడీలను విడుదల చేశారు. ‘‘నిర్మాత మహేశ్‌గారు పెట్టిన డబ్బు తిరిగి రావాలి’’అన్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ‘‘మా బ్యానర్లో ఈ సినిమా విడుదల కాబోతుండటం హ్యాపీగా ఉంది. కంటెంట్ తెలియగానే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. మంచి సబ్జెక్ట్‌తో వస్తున్నాం’’ అన్నారు వరుణ్. ‘‘గ్రేస్‌ఫుల్ అబ్బాయిలు, బ్యూటిఫుల్ అమ్మాయిల ప్రేమే ఈ చిత్రం’’ అన్నారు మహేశ్. ‘‘దర్శకుడు కావాలనే నా 13 ఏళ్ల కల నెరవేరింది’’ అన్నారు దర్శకుడు నిఖిలేష్. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
♦ యువకుడి మృతి, బయటపడిన బాలిక ♦ మొయినాబాద్‌లో ఘటన మొయినాబాద్ : ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉరివేసుకుని బలవన్మరణానికి యత్నించగా యువకుడు మృతిచెందగా.. బాలిక క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన ఎం.నవీన్(23) న్యూబోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా చేస్తున్నాడు. నవీన్‌కు కొంతకాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన బాలిక(17)తో పరిచయం ఏర్పడింది. ఏడాదిగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. బాలిక బుధవారం కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి.. నవీన్‌ను కలిసింది. ఇద్దరు కలసి జూపార్కుకు వెళ్లారు. మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేసి అక్కడి నుంచి మొయినాబాద్‌కు చేరుకున్న వారు.. సురంగల్ రోడ్డు పక్కన ఉన్న ఓ పాడుబడ్డ రేకుల షెడ్లోని ఓ గదిలోకి వెళ్లారు. పై కప్పు పైపునకు కేబుల్ వైరు కట్టి ఇద్దరు ఉరివేసుకున్నారు. నవీన్ మెడకు ఉరి బిగించుకుంది. బాలిక మెడకు వేసుకున్న వైరు తెగిపోవడంతో ఆమె కిందపడింది. ఏం చేయాలో అర్థంకాక నవీన్‌ను కాపాడేందుకు విఫలయత్నం చేసింది. -
ప్రేమజంట బలవన్మరణం
మేళ్లచెర్వు, మండలంలోని కీర్తి సిమెంట్ పరిశ్రమ పరిధిలో ఉరి వేసుకొని ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెర్వుకు చెందిన చిన్నపంగు శౌరి కూతురు మౌనిక (18) రెండేళ్లుగా కీర్తి పరిశ్రమ గేటు ఎదురుగా డబ్బాకొట్టు నిర్వహిస్తున్నది. మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన గుణకుంట వీరస్వామి (30) కీర్తి పరిశ్రమలో లోడింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరస్వామికి పెళ్లయింది. భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, మౌనిక, వీరస్వామి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం రాత్రి వీరి ఇరువురి కలిసి సిమెంట్ పరిశ్రమ పక్కన గల వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం పరిశ్రమలో డ్యూటీ దిగి అటుగా వెళ్తున్న కొంతమంది కార్మికులు చూసి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను కిందికి దించి చూడగా వీరస్వామి షర్ట్ జేబులో సూసైడ్ నోట్ దొరికింది. అందులో మా చావుకి ఎవరూ కారకులు కారని తమ వాళ్లను ఎటువంటి ఇబ్బందులకూ గురిచేయవద్దని, ఇద్దరికీ ఒకేచోట దహనసంస్కారాలు చేయాలని రాసి ఉంది. విషయం తెలుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటనస్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను పోసుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. అయ్యో..పాపం వీరస్వామి మృతదేహం వద్ద అతని భార్య, పిల్లలు ఏడుస్తున్న తీరు గ్రామస్తులను కలిచివేసింది. మృతుడికి నాలుగేళ్ల, నాలుగు నెలల వయస్సుగల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియక ఆ పిల్లలు ఆమెవైపు దీనంగా చూస్తుండడంతో స్థానికులు అయ్యో.. పాపం అంటూ కంటతడి పెట్టుకున్నారు.