శ్రద్ధా శ్రీనాథ్, శైలేష్ కొలను, వెంకటేశ్, బేబీ సారా, వెంకట్, నవాజుద్దీన్
‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘సైంధవ్’ చేశాం. సంక్రాంతి పండగకు రిలీజ్ చేస్తున్నాం.. పండగే పండగ.. మీకు(అభిమానులు, ప్రేక్షకులు)నచ్చేలా నా ఎమోషనల్, యాక్షన్ సీన్స్ కొత్తగా చేశాను. ‘ధర్మచక్రం, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఇలా.. అన్ని సినిమాలను ఆదరించిన మీరు ‘సైంధవ్’ ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని వెంకటేశ్ అన్నారు.
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బేబీ సారా కీలక పాత్రల్లో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో జరిగిన ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’, ‘సుందరకాండ’, ‘మల్లీశ్వరీ’, ‘గురు’, ‘గోపాల గోపాల’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇలా చాలా చిత్రాల కోసం వైజాగ్ వచ్చాను. ఇప్పుడు ‘సైంధవ్’ కోసం వచ్చాను.
న్యూ ఏజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సైంధవ్’. శైలేష్ కొలను బాగా చూపించాడు. ప్రేక్షకులు కంటతడి పెట్టే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాకు హీరో సారా పాప. చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా పండక్కి ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి 75వ సినిమా ‘సైంధవ్’ బాధ్యతని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్.
ఆయన్ను మీరు (ప్రేక్షకులు, అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాను. నేను కమల్‌హాసన్ గారి అభిమానినని చాలాసార్లు చె΄్పాను. ఇకపై నేను వెంకటేశ్‌గారి అభిమానిని కూడా. నవాజుద్దీన్ గారిని తెలుగుకి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన సీనియర్ హీరోలు రియలిస్టిక్ సినిమాలు చేస్తే చూడాలనుకుంటాం.. అలాంటి ఓ సినిమా ‘సైంధవ్’’ అన్నారు శైలేష్ కొలను.
‘‘బ్రహ్మపుత్రుడు’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు తొలిసారి వెంకటేశ్‌గారిని చూశాను. ‘సైంధవ్’ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. ఈ వేడుకలో నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, కెమెరామేన్ మణికందన్ , బేబీ సారా, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, ఎడిటర్ గ్యారీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment