nawazuddin
-
సంక్రాంతికి పండగే పండగ
‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘సైంధవ్’ చేశాం. సంక్రాంతి పండగకు రిలీజ్ చేస్తున్నాం.. పండగే పండగ.. మీకు(అభిమానులు, ప్రేక్షకులు)నచ్చేలా నా ఎమోషనల్, యాక్షన్ సీన్స్ కొత్తగా చేశాను. ‘ధర్మచక్రం, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఇలా.. అన్ని సినిమాలను ఆదరించిన మీరు ‘సైంధవ్’ ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బేబీ సారా కీలక పాత్రల్లో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో జరిగిన ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’, ‘సుందరకాండ’, ‘మల్లీశ్వరీ’, ‘గురు’, ‘గోపాల గోపాల’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇలా చాలా చిత్రాల కోసం వైజాగ్ వచ్చాను. ఇప్పుడు ‘సైంధవ్’ కోసం వచ్చాను. న్యూ ఏజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సైంధవ్’. శైలేష్ కొలను బాగా చూపించాడు. ప్రేక్షకులు కంటతడి పెట్టే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాకు హీరో సారా పాప. చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా పండక్కి ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి 75వ సినిమా ‘సైంధవ్’ బాధ్యతని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆయన్ను మీరు (ప్రేక్షకులు, అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాను. నేను కమల్‌హాసన్ గారి అభిమానినని చాలాసార్లు చె΄్పాను. ఇకపై నేను వెంకటేశ్‌గారి అభిమానిని కూడా. నవాజుద్దీన్ గారిని తెలుగుకి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన సీనియర్ హీరోలు రియలిస్టిక్ సినిమాలు చేస్తే చూడాలనుకుంటాం.. అలాంటి ఓ సినిమా ‘సైంధవ్’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘బ్రహ్మపుత్రుడు’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు తొలిసారి వెంకటేశ్‌గారిని చూశాను. ‘సైంధవ్’ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. ఈ వేడుకలో నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, కెమెరామేన్ మణికందన్ , బేబీ సారా, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, ఎడిటర్ గ్యారీ తదితరులు పాల్గొన్నారు. -
అన్నం కూడా తిననివ్వట్లేదు.. హీరో భార్య సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య సంచలన ఆరోపణలు చేసింది. ఆస్తి వివాదంలో ఆమెపై పోలీసులకు నవాజుద్దీన్ తల్లి మెహ్రునిసా సిద్ధిఖీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతని భార్య ఆలియా కీలక వ్యాఖ్యలు చేసింది. తనను ఇంట్లో చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఆహారం తినేందుకు వెళ్తే వంటగదిలోకి కూడా రానివ్వడం లేదని వాపోయారు. కనీసం ఫుడ్ డెలీవరి ఏజెంట్లను సైతం ఇంట్లోకి అనుమతించలేదని తెలిపింది. అయితే అయితే పాస్‌పోర్ట్ సమస్యల కారణంగా ఆలియా ఇటీవలే తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆంధేరిలోని భర్త ఇంటికి తిరిగొచ్చింది. ఆలియా మాట్లాడుతూ.. 'నన్ను వంటగదిలోకి కూడా అనుమతించలేదు. రూమ్ సోఫాలోనే నా బెడ్‌ను తయారు చేసుకున్నా. ఆహారం పంపే నా స్నేహితులను లోపలికి రానివ్వలేదు. నేను బయటకు వెళ్లడానికి భయపడుతున్నా. కనీసం ఆహారం తీసుకునేందుకు గేటు వద్దకు వెళ్లలేకపోతున్నా. నా గది తలుపులు మూసి ఉంచారు. ఈ విషయంలో పోలీసులకు తన స్టేట్మెంట్ను నమోదు చేయడానికి రాలేదు. దీంతో తన లాయర్ ద్వారా దానిని పూర్తి చేయగలిగా. నాకు దశాబ్ద కాలంగా నవాజ్ తెలుసు. అందుకే అతనిని పెళ్లి చేసుకున్నా. కాబట్టి అతని భార్యగా నేను ఇంట్లో ఎందుకు ఉండకూడదు? డెలివరీ ఏజెంట్లను కూడా ఇంట్లోకి అనుమతించడం లేదు. న్యాయబద్ధంగా ఇంట్లో ఉండేందుకు నాకు హక్కుంది.' అని అన్నారు. (ఇది చదవండి: అతియా శెట్టి-కేఎల్ రాహుల్‌కు ఖరీదైన బహుమతులు...!) కాగా.. ఆలియా నవాజుద్దీన్ సిద్ధిఖీ రెండో భార్య. నవాజుద్దీన్, ఆలియా పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఏడాది క్రితమే వీరు విడిపోయారు. 2020లో ఆలియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నవాజ్ సోదరుడు శారీరక హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ తర్వాత 2021లో నవాజుద్దీన్‌తో విడాకులు తీసుకోవాలనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. దుబాయ్ నుంచి ఆలియా తిరిగి రావడంతో నవాజుద్దీన్ తల్లి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంధేరి బంగ్లాలో ఆలియా ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అయితే ఆలియా ఆరోపణలపై నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పందించలేదని తెలుస్తోంది. ఈ విషయంలో చట్టపరమైన మార్గంలో వెళ్లాలని అతను యోచిస్తున్నట్లు సమాచారం. -
స్వగ్రామంలో రియల్ హీరో...
మధ్యప్రదేశ్ః నటనలో తన ప్రతిభను ప్రదర్శించి, బాలీవుడ్ లో అభిమానుల మనసులు దోచుకుంటున్ననటుడు నవాజుద్దీన్ సిద్ధికి... సినిమాల్లోనే కాక నిజజీవితంలోనూ తనదైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. నటనతో అభిమానుల మనసులను దోచుకుంటూ... ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ... రీల్ లైఫ్ లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన.. తమ సొంత గ్రామం కోసం రియల్ హీరోగానూ మారాడు. ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లాలోని చిన్న పట్టణమైన బుధానాలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి, తమ గ్రామంలోని రైతులకోసం వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నాడు. పివోట్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాటర్ ఎఫిషియంట్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇటీవల అతని టూర్ లో భాగంగా కేన్స్ కు వెళ్ళిన సమయంలో సిద్ధికి అక్కడి ఫ్రెంచ్ రైతులను కలుసుకున్నాడు. వారు అవలంబించే సెంటర్ పివోట్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. పైపులద్వారా నీరు పొలం మొత్తం తడిపే విధానాన్ని తన గ్రామంలో అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేశాడు. ఈ విధానంలో ఒక్కో పైపునుంచి విరజిమ్మే నీరు సుమారు ఎకరం పొలం వరకు తడుపుతుంది. ఈ సంప్రదాయ విధానంతో నీరు సగానికిపైగా పొదుపు అయ్యే అవకాశం ఉంది. తన టూర్ లో తక్కువ నీటితోనే ఎక్కువ సాగుచేసే ఆధునిక పద్ధతులను తెలుసుకున్న సిద్ధికి.. ఆ విధానాన్ని వెంటనే స్వగ్రామంలో అమల్లోకి తెచ్చాడు. అందుకోసం ఓ శాంపిల్ మోడల్ ను షిప్ ద్వారా తమ గ్రామానికి తెప్పించారు. గ్రామస్థులు సైతం ఈ కొత్త పద్ధతిని సునాయాసంగా గ్రహించి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ సాగుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధానా గ్రామంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు సిద్ధికి ప్రవేశపెట్టిన ఈ సరి కొత్త పద్ధతిని వరంగా భావించిన రైతులు... పంటలు విరివిగా పండించేందుకు ముందుకొస్తున్నారు. -
'మూడువేలతో వచ్చాను.. అవే మిగిలినా ఓకే..'
ముంబయి: విలక్షణమైన నటనా ప్రతిభ కలిగిన అతికొద్ది మందిలో నవాజుద్దీన్ సిద్దిఖీ ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్లో ఆయనది తిరుగులేని ప్రస్థానం. గొప్పగొప్ప పాత్రలు పోషించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన మనోగతాన్ని మీడియాతో పంచుకున్నారు. కేవలం రూ.3 వేలతో ముంబయిలో అడుగుపెట్టానని, వాటి ఆధారంగా తాను ప్రస్తుతం సంపాధించిన ఆస్తిమొత్తం పోతుందన్న బాధమాత్రం తనకు లేదని అన్నాడు. అవే మూడు వేలతో తిరిగి ఇంటికి వెళ్లిపోయినా పెద్దగా పట్టించుకోనని అన్నాడు. తాను నిర్మాతలను డబ్బుకోసం పెద్దగా డిమాండ్ చేయనని, తాను నటించే చిత్రాలకు సంబంధించిన నిర్మాతలు చాలా తెలివైనవారని, తన నటనా సామర్థ్యాన్ని గుర్తించి వారే నిర్ణయిస్తారని అన్నారు. 'నేను డబ్బు కోసం డిమాండ్ చేయను. నా చిత్రాల నిర్మాతలు చాలా స్మార్ట్. వారికి నటులకు ఎంత చెల్లించాలో తెలుసు. నేను ఇష్టం వచ్చినట్లు డిమాండ్ చేస్తే అది వారు చెల్లించరు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీకి ఒక నటుడి సామర్థ్యం తెలుసు. నేను డబ్బు కోసం ఈ ఇండస్ట్రీకి రాలేదు. నాకు డబ్బే కావాలంటే మా ఊరు వెళ్లిపోయేవాడిని.. నాకు చాలా పొలం కూడా ఉంది. ఓ రైస్ మిల్ కూడా ప్రారంభించి ఉండేవాడిని' అంటూ ఆయన చెప్పుకొచ్చేవారు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్(2012), ది లంచ్ బాక్స్ (2013), బద్లాపూర్ (2015)వంటి చిత్రాల్లో నవాజుద్దీన్ గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. -
'ఆ యాడ్ చేయనుగాక చేయను'
ఏ ఆర్టిస్ట్ అయినా స్టార్ ఇమేజ్ రాగానే ఆ ఇమేజ్ ను అడ్డంపెట్టుకోని క్యాష్ చేసుకోవాలి అనుకుంటారు. ముఖ్యంగా రెమ్యూనరేషన్ పెంచేయటంతో పాటు, మల్టీనేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్లుగా భారీగా సంపాదించేస్తారు.. బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖి మాత్రం అలా చేయటం లేదు. భజరంగీభాయ్‌జాన్, మాంఝీ లాంటి సినిమాలతో ప్రజెంట్ బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ అందుకున్న ఈ విలక్షణ నటుడు, వచ్చిన ప్రతీ యాడ్‌ను అంగీకరించకుండా సెలక్టివ్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ప్రస్తుతం బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాక సోలో హీరోగా కూడా సత్తా చాటుతున్న నవాజుద్దీన్, ఓ భారీ ఆఫర్ ను కాదన్నాడు. నవాజ్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకున్న ఓ కండోమ్ కంపెనీ తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని భారీ ఆఫర్‌ను ఇచ్చింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ మాత్రం మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల తనకున్న గౌరవంతోనే ఈ ఆఫర్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు.