Allu Arjun Pushpa Pre Release Business: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మిగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఫస్ట్ పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ‘పుష్ప ది రైజ్’ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది.
చదవండి: Pushpa Movie: సమంత స్పెషల్ సాంగ్‌పై ట్రోల్స్
ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్ర బృందం స్పెషల్ సాంగ్‌ను విడుదల చేసింది. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం తెలుగులోనే కాదు మిగతా భాషల్లో సైతం పుష్పకు మంచి స్పందన వస్తోంది. ఈ రునథంమంలో పుష్ప ప్రి-రిలీజ్ ఈవెంట్ రేపు(డిసెంబర్ 12) జరగనున్న సంగతి తెలిసిందే. పుష్ప మూవీకి వస్తోన్న రెస్పాన్స్ దృష్టా ఈ ప్రి-రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఏకంగా 250 కోట్ల రూపాయల బిజినెస్‌తో జరుపుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్‌కు రజనీ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్
అన్ని ఏరియాల్లో ప్రి-రిలీజ్ బిజినెస్‌కు ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేశారట డిస్ట్రిబ్యూటర్లు. అన్నింటికీ మించి సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో వందల కోట్ల బిజినెస్ సాధ్యమైందని ట్రెడ్ వర్గాల నుంచి సమాచారం. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్.. అలాగే నాన్ థియేట్రికల్ (ఓటీటీ, డిజిటిల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో, హిందీ డబ్బింగ్ రైట్స్) కలుపుకొని పుష్ప బిజినెస్ 250 కోట్ల వరకు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పినట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప ది రైజ్ తగ్గేదేలె అనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment