
‘‘కాలింగ్ సహస్ర’లో సవాల్‌తో కూడుకున్న మంచి పాత్ర ఇచ్చిన అరుణ్‌గారికి థ్యాంక్స్. నాలోని మరో కోణాన్ని చూపించే పాత్ర ఇది. ఇకపై కొత్త కథలతో మంచి చిత్రాలు చేస్తాను. ‘కాలింగ్ సహస్ర’ మీకు నచ్చితే పది మందికి చెప్పండి’’ అని ‘సుడిగాలి’ సుధీర్ అన్నారు. అరుణ్ విక్కీరాలా దర్శకత్వంలో ‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకి నటుడు జేడీ చక్రవర్తి, దర్శకులు దశరథ్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సుధీర్ మాట్లాడుతూ–‘‘మా సినిమాను మంచి థియేటర్లలో విడుదల చేసేందుకు సాయం చేసిన బెక్కం వేణుగోపాల్‌గారికి ధన్యవాదాలు. నా ‘గాలోడు’ సినిమా అభిమానుల వల్లే హిట్ అయింది. ఎన్ని జన్మలు ఎత్తినా వారి రుణం తీర్చుకోలేను’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు విజేష్ తయాల్, వెంకటేశ్వర్లు కాటూరి.
Comments
Please login to add a commentAdd a comment