
‘‘కాలింగ్ సహస్ర’ చిత్రంలో ట్విస్టులుంటాయి. సినిమా రిలీజ్ తర్వాత ఆ ట్విస్టుల్ని ప్రేక్షకులు రివీల్ చేసినా కూడా అందరూ థియేటర్‌కు వచ్చి చూస్తారు. ఇందులో మంచి ప్రేమకథ, అంతర్లీనంగా సందేశం ఉన్నాయి’’ అని దర్శకుడు అరుణ్ విక్కీరాలా అన్నారు. ‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా స్పందనా పల్లి, శివ బాలాజీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా అరుణ్ విక్కీరాలా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కాలింగ్ అనేది ఒక కంపెనీ పేరు. సహస్ర అనేది హీరోయిన్ పాత్ర పేరు. ఇందులో సుధీర్ పాత్ర కొత్తగా ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల తర్వాత సుధీర్ అనే వ్యక్తిని మర్చిపోయి..ఆయన పోషించే పాత్రలోకి వెళ్తారు. ఇందులో సుధీర్ కమెడియన్‌గా ఎక్కడా కనిపించడు. ఇది ఓ ప్రయోగమే. షూటింగ్‌లో డాలీషా చేసిన ఓ ఫైట్ సీక్వెన్స్ చూసి ఫైట్ మాస్టరే క్లాప్స్ కొట్టేశాడు. నా తర్వాతి సినిమా షూటింగ్ ప్రారంభమైంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment