Calling Sahasra Movie
-
న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈ సోమవారంతో కొత్త సంవత్సరం మొదలైంది. 2024కి స్వాగతం పలుకుతూ తెలుగు ప్రేక్షకులు బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు. దాదాపు ఈ వారమంతా కూడా ఇదే మూడ్‌లో ఉంటారు. సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దీంతో ఈ వారమైతే థియేటర్లలో చెప్పుకోదగ్గ చిత్రాలు రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఇందుకు తగ్గట్లే ఈ వారం కూడా బోలెడన్ని కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు.. పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ 2 చిత్రాలు కాస్త స్పెషల్‌గా కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ (జనవరి 01 నుంచి 07 వరకు) నెట్‌ఫ్లిక్స్ బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 01 ఫూల్ మీ వన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01 మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ) - జనవరి 01 యూ ఆర్ వాట్ యూ ఈట్: ఏ ట్విన్ ఎక్స్పరిమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01 డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04 హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04 సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04 ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04 కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05 గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 హాట్‌స్టార్ ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03 పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05 అమెజాన్ ప్రైమ్ కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) - జనవరి 01 మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్) - జనవరి 01 ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05 లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05 జీ5 తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05 బుక్ మై షో నాల్ 2 (మరాఠీ సినిమా) - జనవరి 01 ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05 వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియో సినిమా మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03 సోనీ లివ్ క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05 సైనా ప్లే ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05 (ఇదీ చదవండి: ) -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
న్యూ ఇయర్ వచ్చేసింది. భారత దేశం అంతటా అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు కొన్ని లేటెస్ట్ మూవీస్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఓ కొత్త సినిమా.. ఇలా ఓటీటీలోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. ఎప్పుడు చూడాలనేది ప్లాన్ చేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) కమెడియన్‌గా టీవీ స్క్రీన్‌పై కెరీర్ మొదలుపెట్టిన సుధీర్.. 'జబర్దస్త్'లోకి వెళ్లిన తర్వాత సుడిగాలి సుధీర్ అయిపోయాడు. టీమ్ లీడర్ గా స్కిట్స్, యాంకర్‌గా ఈవెంట్స్ హోస్ట్ చేశాడు. ప్రస్తుతం హీరోగా మాత్రమే టచేస్తున్నాడు. కొన్నాళ్ల ముందు 'గాలోడు' అనే మాస్ మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. తాజాగా 'కాలింగ్ సహస్ర' మూవీతో వచ్చాడు. అయితే టెక్నికల్ అంశాలతో తీసిన ఈ సినిమా.. రెగ్యులర్ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. దీంతో ఫ్లాప్‌గా నిలిచింది. డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు బాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కాబట్టి ఎంచక్కా టైమ్ పాస్ చేసేయొచ్చు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
సక్సెస్‌ను హ్యాండిల్ చేయడం కష్టం
‘‘బుల్లితెర షోలకు టీఆర్పీ రేటింగ్స్‌కు ఎక్కువ ప్రాంధాన్యత ఉంటుంది. కానీ సినిమాలకైతే దర్శకుల భవిష్యత్, నిర్మాత డబ్బులు, వినోదాన్ని ఆశించి థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకులు.. ఇలా చాలా విషయాలు ఆలోచించాలి. నా ‘గాలోడు’ సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదు. ఫెయిల్యూర్‌ను హ్యాండిల్ చేయడం సులభమే. కానీ సక్సెస్‌ను హ్యాండిల్ చేయడం కష్టం’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. అరుణ్ విక్కీరాల దర్శకత్వంలో ‘సుడిగాలి’ సుధీర్ హీరోగా రూపొందిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘సుడిగాలి’ సుధీర్ మాట్లాడుతూ– ‘‘కాలింగ్ సహస్ర’ కథ చెప్పినప్పుడు ఇందులోని ఓ పాయింట్ కొత్తగా అనిపించింది. నా కెరీర్లో ఇది ప్రయోగాత్మక సినిమా’’ అని చెప్పుకొచ్చారు. -
నాలోని మరో కోణాన్ని చూస్తారు
‘‘కాలింగ్ సహస్ర’లో సవాల్‌తో కూడుకున్న మంచి పాత్ర ఇచ్చిన అరుణ్‌గారికి థ్యాంక్స్. నాలోని మరో కోణాన్ని చూపించే పాత్ర ఇది. ఇకపై కొత్త కథలతో మంచి చిత్రాలు చేస్తాను. ‘కాలింగ్ సహస్ర’ మీకు నచ్చితే పది మందికి చెప్పండి’’ అని ‘సుడిగాలి’ సుధీర్ అన్నారు. అరుణ్ విక్కీరాలా దర్శకత్వంలో ‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకి నటుడు జేడీ చక్రవర్తి, దర్శకులు దశరథ్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సుధీర్ మాట్లాడుతూ–‘‘మా సినిమాను మంచి థియేటర్లలో విడుదల చేసేందుకు సాయం చేసిన బెక్కం వేణుగోపాల్గారికి ధన్యవాదాలు. నా ‘గాలోడు’ సినిమా అభిమానుల వల్లే హిట్ అయింది. ఎన్ని జన్మలు ఎత్తినా వారి రుణం తీర్చుకోలేను’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు విజేష్ తయాల్, వెంకటేశ్వర్లు కాటూరి. -
సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
‘కాలింగ్ సహస్ర’లో కొత్త సుధీర్‌ని చూస్తారు: డైరెక్టర్
‘‘కాలింగ్ సహస్ర’ చిత్రంలో ట్విస్టులుంటాయి. సినిమా రిలీజ్ తర్వాత ఆ ట్విస్టుల్ని ప్రేక్షకులు రివీల్ చేసినా కూడా అందరూ థియేటర్‌కు వచ్చి చూస్తారు. ఇందులో మంచి ప్రేమకథ, అంతర్లీనంగా సందేశం ఉన్నాయి’’ అని దర్శకుడు అరుణ్ విక్కీరాలా అన్నారు. ‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా స్పందనా పల్లి, శివ బాలాజీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అరుణ్ విక్కీరాలా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కాలింగ్ అనేది ఒక కంపెనీ పేరు. సహస్ర అనేది హీరోయిన్ పాత్ర పేరు. ఇందులో సుధీర్ పాత్ర కొత్తగా ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల తర్వాత సుధీర్ అనే వ్యక్తిని మర్చిపోయి..ఆయన పోషించే పాత్రలోకి వెళ్తారు. ఇందులో సుధీర్ కమెడియన్‌గా ఎక్కడా కనిపించడు. ఇది ఓ ప్రయోగమే. షూటింగ్లో డాలీషా చేసిన ఓ ఫైట్ సీక్వెన్స్ చూసి ఫైట్ మాస్టరే క్లాప్స్ కొట్టేశాడు. నా తర్వాతి సినిమా షూటింగ్ ప్రారంభమైంది’’ అన్నారు. -
సస్పెన్స్ సహస్ర
‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘కాలింగ్ సహస్ర’. అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథి నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ అంశాలతో రానున్న ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘గాలోడు’ హిట్‌తో నాకు మాస్ ఇమేజ్ వచ్చింది. ‘కాలింగ్ సహస్ర’తో సస్పెన్స్ జానర్లోకి అడుగుపెడుతున్నా’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఇప్పటివరకు ఇలాంటి కథతో ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు’’ అన్నారు అరుణ్ విక్కిరాలా. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు విజేష్ తయాల్. -
డేట్ ఫిక్స్
‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా అరుణ్ విక్కీరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. వెంకటేశ్వర్లు కాటూరి, విజేష్ తయల్, చిరంజీవి పమిడి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 1న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ‘‘సుధీర్‌ను సరికొత్త కోణంలో చూపించేలా ఈ సినిమాలో ఆయన పాత్ర ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
వారి రుణం తీర్చుకోలేను : సుడిగాలి సుధీర్
‘‘నేనీ రోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే నా అభిమానుల ప్రేమే కారణం. టీవీ షోలు చేసినా, సినిమాలు చేసినా నా ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు.. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. త్వరలోనే ‘కాలింగ్ సహస్ర’ సినిమాతో థియేటర్స్‌లో సందడి చేస్తాం’’అని హీరో సుధీర్ అన్నారు. అరుణ్ విక్కీరాలా దర్శకత్వంలో సుధీర్, డాలీషా జంటగా నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్‌పై విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మోహిత్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కనుల నీరు రాలదే..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రెస్మీట్లో సుధీర్ మాట్లాడుతూ– ‘‘మోహిత్ మంచి సంగీతాన్ని అందించారు. జిత్తు మాస్టర్ ఈ పాటని చక్కగా కొరియోగ్రఫీ చేశారు’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వర్లు కాటూరి, విజేష్ తయల్. ‘‘కాలింగ్ సహస్ర’ తర్వాత సుధీర్ సూపర్ స్టార్ అవుతాడు’’ అన్నారు అరుణ్ విక్కీరాల. ఈ కార్యక్రమంలో డాలీషా, కెమెరామేన్ శశికిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్, నిర్మాత బెక్కెం వేణుగో΄ాల్, రామచంద్రరావు మాట్లాడారు. -
సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ సినిమా సాంగ్ లాంచ్ (ఫొటోలు)
-
థ్రిల్లింగ్ ఎలిమెంట్‌తో సుడిగాలి సుధీర్ కొత్త సినిమా..
బుల్లి తెర ప్రేక్షకులను అలరించి తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. ‘గాలోడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా...చిత్ర నిర్మాత వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘నిర్మాతలుగా ‘కాలింగ్ సహస్త్ర’ మా తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్ మెమొరీ. డైరెక్టర్ అరుణ్, హీరో సుధీర్, హీరోయిణ్ డాలీషా సపోర్ట్‌తో సినిమాను పూర్తి చేశాం. ఔట్ పుట్ సూపర్‌గా వచ్చింది. సరికొత్త సుధీర్‌ను చూస్తారని నమ్మకంగా చెబుతున్నాను. ఇందులో సుధీర్ పాత్రను వెండి తెరపై చూసిన ఆడియెన్స్ వామ్మో సుధీర్ ఇలాంటి పాత్రలో కూడా నటిస్తారా అనేంత వైల్డ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్‌తో, మాసీగా ఉంటుంది. ప్రేక్షకులు ఊహించని మలుపులతో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోనుంది మా కాలింగ్ సహస్త్ర మూవీ. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌లో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం ’ అన్నారు.