Shiva Shankar Master On Bed For Eight Years: కరోనా రక్కసి ఎంతోమంది ప్రాణాలను బలిగొంది. అందులో టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ కన్ను మూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించారు. కల్యాణ సుందర్, కోమల అమ్మాళ్ తల్లిదండ్రులు కాగా, తండ్రి కొత్వాల్ చావిడిలో పండ్ల వ్యాపారం చేసేవారు. శివ శంకర్ మాస్టర్‌కు చిన్నతనంలో ఉండగా ఒక ప్రమాదం కూడా జరిగిందట.
భయపడి..
శివశంకర్ మాస్టర్ ఏడాదిన్నర వయసు ఉండగా, తనని వాళ్ల పెద్దమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని ఇంటి బయట అరుగుమీద కబుర్లు చెప్పుకునేవారట. ఒకరోజు అరుగు మీద కూర్చొన్న సమయంలో ఒక ఆవు తాడు తెంపుకొని రోడ్డుపైకి వచ్చింది. అది తమ మీదకు వస్తుందేమోనని శివ శంకర్ పెద్దమ్మ భయపడి ఆయన్ను ఎత్తుకొని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లే సమయంలో గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె చేతిలో ఉన్న శివ శంకర్ కూడా కింద పడిపోయారు. దీంతో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత నెల రోజుల పాటు జ్వరం. ఏ డాక్టర్‌కు చూపించినా సరికాకపోవడంతో మాస్టర్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
ఎనిమిదేళ్లు మంచంపైనే..
అదే సమయంలో విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్ అనే ఆయన వద్దకు శివ శంకర్‌ను తీసుకెళ్లారు మాస్టర్ తల్లిదండ్రులు. ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్థారించారు. అప్పుడు ఆ డాక్టర్ శివ శంకర్ తల్లిదండ్రులకు ‘ఈ పిల్లాడిని ఎవరి వద్దకు తీసుకెళ్లకుండా నా దగ్గర వదిలేస్తే లేచి నడిచేలా చేయగలను’ అని హామీ ఇచ్చారు. ఆయనను నమ్మి శివ శంకర్ తండ్రి అక్కడే వదిలేసి వెళ్లిపోయారట. అంతే సుమారు ఎనిమిదేళ్లపాటు శివ శంకర్ పడుకునే ఉన్నారు. తర్వాత ఆ గాయం నుంచి కోలుకున్నారు.
ఇది చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. శివశంకర్ మాస్టర్ ఇకలేరు
Comments
Please login to add a commentAdd a comment