Megastar Chiranjeevi Support To Choreographer Shiva Shankar Master - Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: శివశంకర్‌ మాస్టర్‌కు మెగాస్టార్‌ చేయూత.. తక్షణ సాయంగా..

Published Fri, Nov 26 2021 6:38 PM | Last Updated on Sat, Nov 27 2021 7:21 AM

Megastar Chiranjeevi Support To Shiva Shankar Master - Sakshi

Megastar Chiranjeevi Support To Shiva Shankar Master: మెగాస్టార్‌ చిరంజీవి పేరు వింటే ఫ్యాన్స్‌ విజిల్స్‌ వేయకుండా ఉండలేరు. తనదైన నటనతో అలరించడమే కాకుండా బ్లడ్‌, ఐ, ఆక్సిజన్‌ బ‍్యాంక్స్‌ పెట్టి ఎంతోమందికి ఆసరాగా నిలుస్తున్నారు. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు ఆచార్య. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్ మాస్టర్‌ అనారోగ్యంతో పరిస్థితి విషమంగా ఉన్నసంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున‍్నారు. మాస్టర్‌తో పాటు ఆయన భార్యకు వైరస్‌ సోకడంతో ఆమె హోం క్వారంటైన్‌ అయ్యారు. శివ శంకర్‌ మాస్టర్ పెద్ద కుమారుడికి సైతం కొవిడ్  సోకగా వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 

ఇది చదవండి: విషమంగా శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం, సాయం కోసం ఎదురుచూపు!

ఇంట్లో ముగ్గురు కుటుంబసభ్యులకు కరోనా సోకడంతో ఇబ్బందుల్లో పడింది శివశంకర్‌ కుటుంబం. దీంతో ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు రూ. లక్ష ఖర్చు అవుతున‍్నందున మాస్టర్‌ చిన్న కుమారుడు అజయ్‌ తనకు సహాయం చేయాల్సిందిగా సినీ పెద్దలను కోరారు. విషయం తెలిసిన మెగాస్టార్‌ అజయ్‌కు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకొని, తక్షణ సాయంగా రూ. 3 లక్షల చెక్కు అందజేశారు. వైద్యానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున‍్నారు. శివశంకర్ మాస్టర్‌ కుటుంబానికి తామంతా ఉన్నామని అభయమిచ్చారు. 

ఇది చదవండి: శివశంకర్‌ మాస్టర్‌కు సోనూసూద్‌ సాయం!

'నాన్నకు అనారోగ్యం అని తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్‌ చేసి రమ్మని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు. చిరంజీవి అంటే నాన్నకు ఎంతో అభిమానం. ఆయనతో కలిసి నాన్న సినిమాలు చేశారు. ఇటీవల ఆచార్య షూటింగ్‌లో కూడా నాన్న, చిరంజీవిని కలిశారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి నాకు చాలా అవసరం. చిరంజీవి గారు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనకు ఎన్నటికీ రుణపడి ఉంటాను' అని శివశంకర్‌ మాస్టర్‌ చిన్నకుమారుడు అజయ్‌ తెలిపారు. 

ఇది చదవండి: శివశంకర్‌ మాస్టర్‌కు ధనుష్‌ సాయం!.. టాలీవుడ్‌ స్టార్స్‌పై నెటిజన్ల విమర్శలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement