
సాక్షి, చెన్నై: సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ చెన్నై టీనగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆయన ప్రముఖ నృత్య దర్శకుడు హీరాలాల్ వద్ద శిష్యరికం చేశారు. సుమారు 1700లకు పైగా చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని. 1970లలో కొరియోగ్రాఫర్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి శ్రీను మాస్టర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.