
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబై : మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన కొరియోగ్రాఫర్, రియాల్టీ షో మాజీ కంటెస్టెంట్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆదిత్య గుప్తాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తనకు పరిచయమైన 17 ఏళ్ల కాలేజీ విద్యార్థినికి గుప్తా మత్తు మందు ఇచ్చి లోబరుచుకుని లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
బాధితురాలి తల్లితండ్రులు అంథేరి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రెస్టారెంట్ సమీపంలో సోమవారం స్పృహ కోల్పోయిన బాధితురాలిని పోలీసులు గుర్తించి వైద్య పరీక్షలకు తరలించారు. అనంతరం బాలిక స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసుకున్నారు. లైంగిక దాడికి పాల్పడినట్టు గుప్తా పోలీసు విచారణలో అంగీకరించాడు.