మేడ్చల్: రెండు డ్యాన్స్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్‌కు మేడ్చల్ ఎఎస్‌జే కోర్టు న్యాయమూర్తి జయప్రసాద్ ఆరు నెలల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు. సీఐ గంగాధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షేక్ జానీ పాషా(డ్యాన్స్ మాస్టర్) తన అనుచరులు ఐదుగురితో కలిసి 2014లో మరో డ్యాన్స్ గ్రూపుతో గొడవపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మేడ్చల్ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి జయప్రసాద్ బుధవారం జాని మాస్టర్‌తో పాటు అతని అనుచరులు ఐదురురికి ఆరు నెలల జైలు శిక్ష రూ.1000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment