medchal court
-
మహిళకు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి లాగేందుకు యత్నం.. చివరికి
సాక్షి, జీడిమెట్ల: మహిళకు మాయ మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించిన వ్యక్తికి మేడ్చల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. సీఐ బాలరాజు ఎస్సై గౌతమ్‌కుమార్ వివరాల ప్రకారం.. 2021లో విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ హైదరాబాద్ వచ్చేందుకు కర్నూల్ బస్టాండ్‌లో నిలబడింది. కర్నూల్లో మహిళను పరిచయం చేసుకున్న అదే ప్రాంతానికి చెందిన బుగ్గన మధుమోహన్‌రెడ్డి(33) ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చాడు. అనంతరం ఆమెను వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించగా తప్పించుకున్న మహిళ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు మధుమోహన్‌ను రిమాండ్‌కు తరలించారు. కేసు పుర్వపరాలు పరిశీలించిన మేడ్చల్ జిల్లా కోర్టు మంగళవారం నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా వేసింది. -
జాని మాస్టర్‌కు జైలు శిక్ష
మేడ్చల్: రెండు డ్యాన్స్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్‌కు మేడ్చల్ ఎఎస్‌జే కోర్టు న్యాయమూర్తి జయప్రసాద్ ఆరు నెలల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు. సీఐ గంగాధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షేక్ జానీ పాషా(డ్యాన్స్ మాస్టర్) తన అనుచరులు ఐదుగురితో కలిసి 2014లో మరో డ్యాన్స్ గ్రూపుతో గొడవపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మేడ్చల్ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి జయప్రసాద్ బుధవారం జాని మాస్టర్‌తో పాటు అతని అనుచరులు ఐదురురికి ఆరు నెలల జైలు శిక్ష రూ.1000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. -
'ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయండి'
హైదరాబాద్: తెనాలి ఎమ్మెల్యే అలపాటి రాజేంద్రప్రసాద్‌తోపాటు మరో నలుగరిపై కేసు నమోదు చేయాలని మేడ్చల్ కోర్టు జీడిమెట్ల పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వారిపై 420, 458, 471, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొంది. అలాగే కుత్బుల్లాపూర్ మాజీ కార్పొరేటర్‌తోపాటు మున్సిపల్ మాజీ కమిషనర్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఎన్నారై కాలేజీ అక్రమ అనుమతుల నేపథ్యంలో మేడ్చల్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.