Is Sai Pallavi to Turn Choreographer for Sekhar Kammula's Love Story Movie? | కొరియోగ్రాఫర్‌ అవతారం ఎత్తనున్న సాయి పల్లవి - Sakshi
Sakshi News home page

కొరియోగ్రాఫర్‌ అవతారం ఎత్తనున్న హీరోయిన్‌?!

Published Tue, Jul 14 2020 3:46 PM | Last Updated on Tue, Jul 14 2020 4:39 PM

Is Sai Pallavi to Turn Choreographer for Love Story Movie - Sakshi

సాయి పల్లవి పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఆమె డ్యాన్స్‌. 'ఫిదా'తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి డ్యాన్స్ పరంగా తనకు పోటీ వచ్చే హీరోయిన్స్ లేరని నిరూపించుకున్నారు. ఇప్పటికే సాయి పల్లవి ‘రౌడీ బేబి’, ‘పిల్లా రేణుకా’ పాటలకు ఎంత ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆమెకు ఓ కొత్త బాధ్యత అప్పగించారట. ఎలాంటి డాన్స్ అయినా అలవోకగా చేయగలిగే సత్తా సాయి పల్లవిది. ఆ నమ్మకం తోనే 'లవ్ స్టోరీ'లో ఓ పాట కొరియోగ్రఫీ బాధ్యతలను ఆమె భుజాలపై వేశారట. 

ఇప్పటికే 90శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘లవ్‌ స్టోరీ’ సినిమాకు సంబంధించి మరో రెండు వారాల షూటింగ్‌ పెండింగ్‌లో ఉంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాటను కూడా చిత్రీకరించాల్సి ఉన్నట్లు సమాచారం. ఇదే పాటకు సాయి పల్లవిని కొరియోగ్రఫీ చేయమని కోరారంట శేఖర్‌ కమ్ముల. మరికొద్ది రోజుల్లో రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ కుర్రాడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement