ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజ ప్రస్తుతం డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్ ఐదో సీజన్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో డ్యాన్స్ నేర్చిన చిన్నారులు తమ స్టెప్పులతో షోను షేక్ చేస్తున్నారు. ఇటీవల ఎనిమిదేళ్ల బాలుడు హిమాన్షు తన డ్యాన్స్‌తో జడ్జీలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అనంతరం తన జీవితంలోని కష్టాలను వివరించాడు.
ఢిల్లీ తమ స్వస్థలం అని, చిన్నవయసులోనే నాన్న చనిపోవడంతో అప్పటినుంచి సోదరుడితోపాటు తనను తల్లే పెంచుతుందని చెప్పాడు. రిక్షా తొక్కుతూ తమను పెంచి పోషిస్తుందని పేర్కొన్నాడు. ఆ రిక్షా కొనడానికి కూడా డబ్బుల్లేకపోవడంతో లోన్ తీసుకుందని చెప్పాడు. ప్రతినెలా లోన్ డబ్బులు కట్టేందుకు ఆమె నానాకష్టాలు పడుతోందని వాపోయాడు. అతడి కన్నీటిగాథ విని కదిలిపోయిన రెమో డిసౌజ ఆ రిక్షా కొనేందుకు చేసిన అప్పు తీర్చేందుకు ముందుకు వచ్చాడు. ఇకపై ఆ రిక్షా మీదేనని, మిగిలిన లోను తాను కట్టేస్తానని హామీ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment