సినిమా ఇండస్ట్రీలో వేధింపులు ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువగా ఈ సమస్యలను ఫేస్ చేస్తుంటారు. తాజాగా షూటింగ్‌లో పాల్గొన్న ఓ హీరోయిన్‌కు అలాంటి సంఘటనే ఎదురైందిృ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. సినిమా సెట్స్‌లో తనను లైంగిక వేధింపులకు గురిచేయడంతో వెంటనే షూటింగ్ నుంచి వచ్చేశానని తెలిపింది.
(ఇది చదవండి: టోలీచౌకీ కుర్రాడు.. అదరగొట్టేశాడు: రాజమౌళి ట్వీట్ వైరల్!)
కోల్‌కతాకు చెంది బెంగాలీ నటి, రాజకీయవేత్త అయిన సయంతిక బెనర్జీ ఇటీవలే బంగ్లాదేశ్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంది. అయితే సెట్స్‌లో తనపట్ల కొరియోగ్రాఫర్ మైఖేల్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. షూటింగ్ సమయంలో నా అనుమతి లేకుండానే చేతులు పట్టుకున్నాడని తెలిపింది. అయితే ఈ విషయాన్ని నిర్మాతకు చెప్పినా పట్టించుకోలేదని వెల్లడించింది. నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో షూట్ మధ్యలోనే ఆపేసి ఇండియాకు తిరిగొచ్చానని పేర్కొంది.
(ఇది చదవండి: అలాంటి వాళ్లను పెడితే బిగ్‌బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్)
అయితే ఈ ఘటనపై నిర్మాతలు ఇంకా స్పందించలేదు. బంగ్లాదేశ్ నుంచి తిరిగొచ్చిన సయంతిక తన రాబోయే చిత్రం 'చాయాబాజ్' షూటింగ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె షూటింగ్‌లో జరిగిన సంఘటనను వివరించింది. కాగా.. ప్రస్తుతం తాజు కమ్రుల్ దర్శకత్వం వహిస్తోన్న 'ఛాయాబాజ్' చిత్రంలో జయేద్ ఖాన్ సరసన సయంతిక నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment