
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో ఆయన చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇప్పటికే జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అత్యాచారం కేసుతో పాటు పోక్సో కేసు నమోదైంది.
తాజాగా కొరియోగ్రాఫర్ జానీకి సంబంధించిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. జనసేన పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న జానీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఏపీలో జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జానీ మరింత రెచ్చిపోయారు. తన తోటి కొరియోగ్రాఫర్లను తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: ముమ్మరంగా ఆపరేషన్ ‘జానీ’)
సభ్యత్వం ఇవ్వకుండా వేధింపులు..
జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జానీ మాస్టర్ దారుణాలకు అడ్డులేకుండా పోయింది. తెలుగు ఫిల్మ్, టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత తోటి కొరియోగ్రాఫర్స్‌ను వేధింపులకు గురి చేశారు. కార్యవర్గం నిర్ణయాలను సైతం లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహారించారు. అసోసియేషన్ ఆడిషన్స్‌లో సెలక్ట్ అయిన వారికి సభ్యత్వం ఇవ్వకుండా వేధించారు. దాదాపు 90 మంది కొరియోగ్రాఫర్స్‌ను సభ్యత్వం ఇవ్వకుండా జానీ మాస్టర్ వేధింపులకు గురిచేశారు. ఇండస్ట్రీలో అతనికి పలుకుబడి ఉండడంతో అరాచకాలపై మాట్లాడేందుకు కొరియోగ్రాఫర్స్ జంకుతున్నారు.
గాలిస్తున్న పోలీసులు..
యువతి ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం అతను జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు అతని కోసం లడఖ్ బయలుదేరి వెళ్లారు. త్వరలోనే జానీమాస్టర్ అరెస్ట్ అయ్యే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment