ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఢీ షో వల్ల మంచి పేరు వచ్చింది, కానీ తగినంత సంపాదన రాలేదని ఆయన వాపోయారు. తాజాగా ఆయన మరణంపై డ్యాన్సర్ ఝాన్సీ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. 'చైతన్య అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల తన కుటుంబం బాధపడుతోంది. తను డబ్బులు ఇవ్వాల్సిన కళాకారులతో కూర్చుని మాట్లాడాల్సింది. ఎందుకంటే.. అందరూ తనతో కలిసి ప్రయాణం చేసినవాళ్లే! నా పరిస్థితి ఇలా ఉంది, చచ్చిపోవాలనిపిస్తోందని చెప్పుంటే ప్రతి ఒక్క డ్యాన్సర్ కరిగిపోయేవాళ్లు.
మా కళాకారులు డబ్బులు ఇవ్వమని వేధించేంత కఠినమైనవాళ్లు కాదు. అన్నయ్య.. ఎందుకింత పని చేశావో అర్థం కావడం లేదు. మీరెంత మంచివాళ్లంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా తోటివారికి సాయం చేసేవాళ్లు. ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో అన్నయ్యకు కొంత డబ్బు రావాల్సి ఉంది. కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. కానీ మిగతా కొంతమంది ఆర్టిస్టులు అన్నయ్యకు హ్యాండిచ్చారు. దీంతో కమిటీ వాళ్లు రూ.6-7 లక్షలు పేమెంట్ ఇవ్వకుండా ఆపేశారు.
అక్కడికి వచ్చిన ఆర్టిస్టులు తమకు డబ్బులివ్వకపోతే ఊరుకోరు కాబట్టి చైతన్య అన్నయ్య వేరే దగ్గర అప్పు తెచ్చి వాళ్లకు డబ్బులిచ్చారు. కళాకారులకు అన్యాయం చేయకూడదన్న మనస్తత్వం ఆయనది. ఇలా పేమెంట్ సర్దే క్రమంలో అప్పు మీద అప్పు చేస్తూ తను ఇబ్బందిపడ్డారు. నాలుగైదు రోజుల క్రితమే ఆయన్ని కలిశాను. నాకు ఢీ షోలో కనిపించాలనుంది, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్తే నెక్స్ట్ సీజన్‌లో ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన ఎంత ఎత్తులో ఉన్నా తన కింద ఉన్న కళాకారులకు ఎంతో మర్యాద ఇస్తారు' అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది కండక్టర్ ఝాన్సీ.
చదవండి: దుబాయ్‌లో లగ్జరీ విల్లా కొన్న మహేశ్‌బాబు
డీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment