
‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా మావ, ఉ ఊ అంటావా మావ..’ పాటలో సమంత వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేశాయి. అంతేకాదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ డ్యాన్స్‌లకు ఆయన అభిమానులు సంబరపడిపోయారు. ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసి అల్లు అర్జున్, సమంతల ప్రశంసలు అందుకున్నారు నృత్య దర్శకుడు విజయ్ పొలంకి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘పలాస 1978’ లో హిట్ అయిన ‘నక్కిలీసు గొలుసు..’పాట నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘విజేత, కొబ్బరిమట్ట, శశి’ ఇటీవల ‘పుష్ప, హీరో’ చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చాను. ప్రస్తుతం ‘నరకాసుర’ చిత్రంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment