తారక్‌ అద్భుతమైన డ్యాన్సర్‌.. ఆయన స్టెప్పులేస్తుంటే..: కొరియోగ్రాఫర్‌ | Jr NTR A Fabulous Dancer: Choreographer Bosco Martis | Sakshi
Sakshi News home page

జూనియర్‌ ఎన్టీఆర్‌ అద్భుతమైన డ్యాన్సర్‌.. ఆయనతో పని చేయడం.. : బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌

Published Wed, Jul 24 2024 9:31 AM | Last Updated on Wed, Jul 24 2024 9:47 AM

Jr NTR A Fabulous Dancer: Choreographer Bosco Martis

హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అద్భుతమైన డ్యాన్సర్‌.. ఎంతో అలవోకగా స్టెప్పులేస్తాడు. ఆయన డ్యాన్స్‌ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు అంటున్నాడు బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ బోస్కో మార్టిస్‌. ఈయన దేవర: పార్ట్‌ 1 సినిమాకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.

అద్భుతమైన డ్యాన్సర్‌
తాజాగా ఆయన దేవర విశేషాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నేను దేవర మూవీకి పని చేస్తున్నాను. హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అద్భుతమైన వ్యక్తి. సూపర్‌గా డ్యాన్స్‌ చేసే హీరోల్లో ఈయన ఒకరు. ఏ స్టెప్పులైనా సులువుగా నేర్చేసుకుంటాడు. ఆయన డ్యాన్స్‌ చేయడం చూస్తుంటే మనకే సంతోషంగా అనిపిస్తుంది. ఆయన డ్యాన్స్‌ మనం ఎంజాయ్‌ చేస్తాం. తనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం అని చెప్పుకొచ్చాడు.

ఆ వైరల్‌ స్టెప్పులు నేర్పింది ఈయనే!
బోస్కో ఇటీవలే తారక్‌తో కలిసి దిగిన ఫోటోను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ఇకపోతే ఈ మధ్య వైరల్‌గా మారిన తాబ తాబ..(విక్కీ కౌశల్‌ బ్యాడ్‌ న్యూస్‌ మూవీలోని ఓ సాంగ్‌) స్టెప్పులు కూడా ఈయన కనిపెట్టినవే! దేవర విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ కథానాయిక. ఈ మూవీని సెప్టెంబర్‌ 27న విడుదల చేయనున్నారు.

 

 

చదవండి: సినిమా దారుణంగా ఫ్లాప్‌.. ఆ బాధ్యత నాదే: దర్శకురాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement