టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ చేసుకున్నారు. ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చైతన్య అప్పుల బాధ తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరు క్లబ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆత్మహత్యకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
(ఇది చదవండి: సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు?)
'మమ్మీ, డాడీ, చెల్లి నన్ను బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానీయలేదు. చెల్లి ఫీల్ అవ్వొద్దు. లవ్ యూ అమ్మా. నా సహచరులందరికీ సారీ. నేను చాలామందిని ఇబ్బంది పెట్టేశా. మీ అందరికీ సారీ. డబ్బు విషయంలో నా మంచితనాన్ని కోల్పోయా. అప్పులు చేయడమే కాదు.. తీర్చే సత్తా ఉండాలి. సత్తా ఉంది.. కానీ నా వల్ల అవ్వట్లేదు. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నా. ఇది నా లాస్ట్ డే. అప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. నా వల్ల ఇబ్బంది పడిన వారందరికీ సారీ. డ్యాన్స్ షోతో నాకు పేరు వచ్చింది. కానీ తగినంత సంపాదన రాలేదు.' అంటూ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు.
(ఇది చదవండి: మీకు హీరోలను అడిగే ధైర్యం ఉందా?.. శ్రియా కామెంట్స్ వైరల్)
Comments
Please login to add a commentAdd a comment